Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

మత్తు వదులుతోంది

drive

*మద్యం సేవించి వాహనం నడుపుతే కటకటాల్లోకే..
*నల్లగొండలో తగ్గిన రోడ్డు ప్రమాదాలు
*ప్రమాదాలు నియంత్రించడానికి తగు చర్యలు తీసుకుంటున్న పోలీస్ అధికారులు

మన తెలంగాణ/నల్లగొండ టౌన్: మందుబాబులకు పెద్ద చిక్కొచ్చిపడింది..! మద్యం తాగి వాహనం నడిపితేచాలు వాహనదారులు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. పోలీసు శాఖ చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వందల సంఖ్యలో మందుబాబులు చిక్కుతున్నారు. పరిమితికి మించి ఆల్కాహాల్ తాగినట్లు బ్రీత్‌ఎనలైజర్ చూపిస్తే ఊచలు లెక్కించాల్సిందే అని పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్నారు . మోతాదుగా తీసుకున్నట్లు తేలితే జరిమానా సరిపోతుంది. ఒక్క లైట్‌బీర్, 15 ఎంఎల్ మద్యం సేవిస్తే బ్రీత్‌ఎనలైజర్‌లో 30 శాతం చూపిస్తోంది. రెండు పెగ్గులు, హార్డ్‌బీర్ తాగితే 60 నుంచి 120 శాతం వరకు చూపుతోంది. 30 శాతం వరకు ఫైన్‌తో వదిలేస్తున్నారు. 35 శాతం దాటితే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని కోర్డులో హాజరుపరుచుతున్నారు. నల్లగొండ లో ప్రతీ రోజు సాయంత్రం 5 గం॥ నుంచి 7 గం॥ వరకు ట్రాఫిక్ పోలీసులు డ్రంక్‌అండ్‌డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. రోజు సుమారు 5 నుంచి10 కేసుల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కింద నమోదవుతున్నాయి. ఈనెల 13న ఒకేరోజు 30 కేసులు నమోదు చేసి వారిని జైలుకు తరలించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపితే రూ. 2,000 జరిమానతో పాటు వారం రోజుల జైలు శిక్షను న్యాయస్థానం నిర్ణయిస్తుంది. ఇవి కాక వాహనాలకు ఇన్సూరెన్స్ లేకపోవడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపితే రూ. 1000 జరిమానా, లైసెన్స్ లేకపోతే 500 నుంచి 1500 వరకు జరిమానా విధిస్తున్నారు. నూతనంగా వాహన కొనుగోలు అయిన తర్వాత ఒక నెల గడువు, వాహనం 500 కిలోమీటర్లు రీడింగ్ పరిధి ఉంటుంది. అంతకు మించితే 2000 రూపాయల జరిమానా విధిస్తున్నారు. దీంతో నల్లగొండ పట్టణ పరిసర ప్రాంతాలలోని వాహనదారులు తమ అవసరాలకు పట్టణానికి విచ్చేసి తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో మద్యం సేవించాలంటే భయాందోళనకు గురవుతున్నారు. దీంతో ప్రమాదాలు జరగకుండా వాహనదారులు సక్రమంగా ఇంటికి వెళ్లుతున్నారు. పోలీసుల తనిఖీల వలన వాహసదారులు అతని కుటుంబం క్షేమంగా ఉంటుంది. గత సం॥ కంటే 2017 లో మద్యం సేవించి వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గు రైన కేసులు తగ్గినట్లు పోలీసులు తెలుపుతున్నారు.

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
నల్లగొండ ట్రాఫిక్ సీఐ ఆదిరెడ్డి
వాహనదారులు రహదారిపై వాహనం నడిపే సమయంలో మద్యం సేవించి నడపడం వలన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కావున జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ప్రతిరోజు సాయం త్రం 5 గం॥ నుంచి 7 గం॥ వరకు, అదే విధంగా వెహికిల్ చెకప్‌లో ఎనలైజర్ ద్వారా మద్యం సేవించిన వాహనదారులపై కేసు నమోదు చేసి కోర్టులకు హాజరుపరుచుతున్నాము. ఇందువలన ఇటీవల కాలంలో మద్యం సేవించి వాహనం నడిపిన ప్రమాదాలు పూర్తిగా తగ్గాయి. వాహనదారులు ఆల్కాహాల్ సేవించి రోడ్డు మీదకు రావాలంటే భయపడుతున్నారు. ఇది మంచి పరిణామం.

Comments

comments