Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

‘థగ్స్’ కలెక్షన్స్ అదుర్స్..!

Thugs Of Hindostan Box Office Collections

ముంబయి: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, మెగాస్టార్ అమితాబచ్చన్ హీరోలుగా ‘ధూమ్’ సిరీస్ ఫేం విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఆ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదని బయట వినిపిస్తున్న టాక్. చిత్రంలో ఎలాంటి విషయం లేదని క్రిటిక్స్ తెల్చేశారు. మొదటి ఆట నుంచే బాలీవుడ్ డిజాస్టర్స్ కే తలదన్నే డిజాస్టర్ ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ అంటూ సామాజిక మాధ్యమాల్లో సైతం కామెంట్స్ వచ్చేశాయి. ఇక రివ్యూ రైటర్స్ అయితే ఈ మూవీని ఆటాడేసుకున్నారనే చెప్పాలి. ఈ చిత్రానికి చెత్త రేటింగ్స్ ఇచ్చారు.

ఇలా నెగెటివ్ టాక్ తెచ్చుకున్న’థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ తొలి రోజు కలెక్షన్లతో మాత్రం రికార్డులు తిరగరాసింది. హిందీ సినిమా చరిత్రలోనే తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా నిలిచింది. కేవలం హిందీ వర్షెనే తొలిరోజు ఏకంగా రూ.50.75 కోట్లు వసూలు చేయడం విశేషం. అలాగే తెలుగు, తమిళ్ వర్షెన్లు కలిపి మొత్తం రూ.52.25 కోట్ల వసూళ్లు సాధించినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. దిపావళి సెలవు, సినిమా రిలీజ్‌కు ముందే విపరీతమైన హైప్ క్రియేట్ కావడం, భారీ స్థాయి థియేటర్లలో విడుదల అవడంతో ఈ మూవీ ఓపెనింగ్ కలెక్షన్ల రికార్డుకు కలిసొచ్చిందని ఆదర్శ్ పేర్కొన్నారు. అయితే, బాలీవుడ్ లో కలెక్షన్స్ పరంగా రికార్డుల మోత మోగించిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ మిగతా భాషల్లో మాత్రం ఉసూరుమంది.

Thugs Of Hindostan Box Office Collections Create Record

Telangana Breaking News

Comments

comments