Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

తొలిరోజు వసూళ్లలో కొత్త రికార్డు

Thugs-of-Hindostanఅమీర్‌ఖాన్ నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది.  అయితే ఈ చిత్రానికి మాత్రం భారీ కలెక్షన్లు వస్తుండడం విశేషం. అమీర్, అమితాబ్‌బచ్చన్, కత్రినాకైఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం తొలిరోజు వసూళ్లతో ‘బాహుబలి-ది కంక్లూజన్’ సినిమాను అధిగమించింది. ఫస్ట్‌డే కలెక్షన్లలో ఇండియాలో మొన్నటి వరకు ‘బాహుబలి-2’ సినిమాదే హవా.  దేశంలోని ఐదు వేల థియేటర్లలో  విడుదలైన ఆ సినిమా తొలిరోజు 40 కోట్ల 73 లక్షల రూపాయల నెట్ సాధించింది. ఇప్పుడు ఆ సినిమా రికార్డును ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ బద్దలు కొట్టింది. ఈ చిత్రం ఆరు వేలకు పైగా స్క్రీన్స్‌పై విడుదలై మొదటి రోజు ఏకంగా 52 కోట్ల 25 లక్షల రూపాయలను వసూలు చేసి రికార్డు సృష్టించింది. దీంతో తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన హీరోగా అవతరించాడు అమీర్‌ఖాన్.

Thugs of Hindostan Record in First Day Collection 

Telangana News

Comments

comments