Home లైఫ్ స్టైల్ థైరాయిడ్ క్యాన్సర్

థైరాయిడ్ క్యాన్సర్

thyroid-cancerరానున్న సంవత్సరాల్లో, తలఎత్తే సైటోపాథోలజిస్టులు, ప్రామాణికమైన రోగనిర్ధారక ప్రయోగశాలలు, ఎండోక్రైన్ సర్జన్ల కొరతను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోకపోతే, థైరాయిడ్ క్యాన్సర్ రోగుల ఆరోగ్యపరిస్థితి పై ప్రభావం చాలా తీవ్రంగా ఉండవచ్చు.
ప్రస్తుతం, జంట రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ఏలలో కేవలం ముగ్గురు-నలుగురు సైటోపాథోలజిస్టులు ఉండగా, ఇద్దరు-ముగ్గురు ఎండోక్రైన్ సర్జన్లు (శస్త్రచికిత్సానిపుణులు) మాత్రమే ఉన్నారు. సైటోపాథోలజిస్టులు మరియు ఎండోక్రైన్ సర్జన్ల కొరతకు కారణం – ఈ నిపుణులకు వృత్తిపరమైన అవకాశాలు పరిమితంగా ఉండటం, వైద్యరంగంలో వీటిని గురించి అవగాహన తక్కువగా ఉండటం. ఈ తరహా నిపుణులకు ఆసుపత్రుల్లో డిమాండు తక్కువగా ఉన్నది. అందువలన, చాలా తక్కువ మంది విద్యార్ధులు మాత్రమే ఈ తరహా రంగాలను తమ వృత్తి ఆప్షన్‌ఏగా ఎంచుకునేందుకు ముందుకు వస్తున్నారు.
డా. ఎ. జకీర్ అలీ, కన్సల్టెంట్ మరియు హెడ్, అణు ఔషధ విభాగం, బసవరామతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి మరియు ప్రయోగ సంస్థను అనుసరించి, ప్రతి సంవత్సరం మేము 400 మంది కొత్త రోగులకు చికిత్స చేస్తున్నాము. 8 ఏళ్ళ క్రితం ఈ సంఖ్య 150 ఉండేది. సైటోపాథోలజిస్టులనే పద్ధతే లేని కారణంగా, జనరల్ పాథోలజిస్టులే, సామాన్య పాథోలజీతో పాటు, సైటోపాథోలజీని కూడా నిర్వహిస్తున్నారు. సైటోపాథోలజీలో ఫెలోషిప్‌ఏను ఆఫర్ చేసే కేంద్రాలు చాలా తక్కువగా ఉన్నాయి. పైగా, అంత విస్తారమైనది కాని ఈ స్పెషాలిటీలో పెద్దగా ఉద్యోగావకాశాలు మరియు రెమ్యూనరేషన్ కూడా లభించటం లేదు.
సైటోపాథోలజిస్టులవలెనే, ఎండోక్రైన్ సర్జన్లు కూడా చాలా అరుదుగా లభిస్తుంటారు. ఇందుకు కారణం – ఈ సూపర్ స్పెషలైజేషన్ సాధారణంగా అన్ని సంస్థల్లోనూ అందుబాటులో లేదు. ఈ స్పెషలైజేషన్‌ఏను గురించి వైద్యులకే చాలా తక్కువ అవగాహన ఉన్నది. పైగా, థైరాయిడ్ కార్సినోమా లేదా పారాథైరాయిడ్ అడెనోమా వంటి వాటి కోసం చేసే సర్జరీలను చాలా కేసుల్లో క్యాన్సర్ స్పెషలిస్టులే(ఆంకోలజిస్టులే) చేస్తున్నారు.
శస్త్రచికిత్స అనంతరం, రోగులకు రేడియోధార్మిక అయోడిన్ స్కాన్లను జరపవలసి ఉంటుంది.
రాష్ట్రంలో ఒక ప్రామాణికమైన ప్రయోగశాలను కనుగొనటంలో ఎదురవుతున్న సవాళ్ళను ప్రత్యేకంగా పేర్కొంటూ డా. అలీ ఇలా అన్నారు, సరైన సౌకర్యాలు లేని ప్రయోగశాలలు, పట్టణం నిండా, తక్కువ ఖర్చుకే రోగనిర్ధారణ సేవలను అందిస్తామంటూ వెలుస్తున్నాయి. ప్రామాణికమైన ప్రయోగశాలలో, మౌలికసదుపాయాలు, ఉపకరణాలు, పాథోలజిస్టులు, సాంకేతికనిపుణులు, ఎన్‌ఎబిఎల్ అక్రెడిషన్ల పై బోలెడంత పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. ఈ ప్రయోగశాలలను నడిపేందుకు, మంచి పాథోలజిస్టులను వెదికి పట్టుకోవటం కూడా అంతే కష్టమైన పని.
థైరాయిడ్ క్యాన్సర్‌ఏకు, కణాల స్థాయిలో థైరాయిడ్ వ్యాధులను గురించి అధ్యయన చేసి, నిర్ధారించగలిగిన, కణుతులను, కణుతులు కాని కణాలను వేరువేరుగా గుర్తించి, శస్త్రచికిత్సకు సూచించగల అనుభవజ్ఞలైన థైరాయిడ్ సైటోపాథోలజిస్టులు అవసరం. సరళమైన థైరాయిడ్ నాడ్యూల్ కోసం రోగులు, థైరాయిడ్ పనితీరును పరిశీలించే పరీక్ష, మెడ అల్ట్రాసౌఁడ్, ఫైన్ నీడిల్ యాస్పిరేషన్ సైటోలజీ (ఎఫ్‌ఎన్‌ఎసి) మొదలైన ప్రాథమికమైన పరీక్షలను చేయించుకోవలసి వస్తోంది. తొలగించవలసిన కంతులను కలిగి ఉన్న రోగులను గుర్తించేందుకు థైరాయిడ్ కంతుల సైటోపాథోలజీని అంచనా వేసేందుకు విస్తృతంగా ఉపయోగించే రెండు రోగనిర్ధారణ పరిజ్ఞానాలు – ఫైన్ నీడిల్ యాస్పిరేషన్ (ఎఫ్‌ఎన్‌ఎ) బయాప్సీ మరియు ఫైన్ నీడిల్ క్యాపిలరీ శాంప్లింగ్. అపారమైన పరిజ్ఞానం, అవగాహన మరియు సాధన అవసరమయ్యే కారణంగా, అనుభవరహితులైన సాంకేతికనిపుణులు ఈ ప్రక్రియలను ఖచ్ఛితంగా చేయగలగటం చాలా చాలా అరుదు.
ఈ సమస్యలను పరిష్కరించేందుకు, డా. అలీ ఇలా చెప్పారు, మరిన్ని ఇనిస్టిట్యూట్‌ఏలలో సైటోపాథోలజీని మరియు ఎండోక్రైనోలజీ శస్త్రచికిత్స కోర్సులను సూపర్ స్పెషలైజేషన్ కోర్సులుగా ప్రవేశపెట్టాలి. వైద్యులు, ప్రజల్లో వీటిని గురించి అవగాహన పెంపొందించాలి, ఇటువంటి స్పెషలిస్టులకు ఉద్యోగావకాశాలను ఎక్కువగా కల్పించాలి. రోగనిర్ధారక ప్రయోగశాలలను ప్రామాణీకరించేందుకు ప్రభుత్వం తప్పనిసరిగా ఎన్‌ఎబిఎల్ అక్రిడిటేషన్‌ఏను లేదా తత్సమానమైన ధృవీకరణ పత్రాలను, అన్ని ప్రయోగశాలలను నడిపేందుకు, తప్పనిసరి చేయాలి.
ఆరంభచికిత్స అనంతరం ఫాలో-అప్‌ఏ కోసం కొన్ని కేసుల్లో 20 ఏళ్ళు, ఇంకా ఎక్కువ కాలం పాటు చాలామంది రోగులు పరిశీలనలో ఉండవలసిన అవసరం ఉన్న కారణంగా ఎంతో క్లిష్టమైనదైన కారనంగా, థైరాయిడ్ క్యాన్సర్ రోగులు ఇప్పటికే, చికిత్స విషయంలోనూ, రోగనియంత్రణలోనూ పలురకాల సమస్యలను ఎదుర్కుంటున్నారు. రేడియోధార్మిక అయోడిన్‌ఏతో నిర్వహించబడే, ముఖ్యవైద్యం మరియు ఫాలోఅప్ చాలా తక్కువ ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉన్నది. అణు ఔషధ వైద్యులు అందుబాటులో ఉండటం మరొక ప్రధానమైన అవరోధం. సామాన్య వైద్యులు, సామాన్య శస్త్రచికిత్సానిపుణులు, చెవి-ముక్కు-గొంతు శస్త్రచికిత్సానిపుణులు, రోగులను ఆంకోసర్జన్లకు, ఎండోక్రైన్ సర్జన్లకు రిఫర్ చేయటంలో జరిగే జాప్యం కూడా సమయానికి చికిత్స అందటంలో అవరోధంగా పరిణమిస్తోంది. ఒక్కోసారి అసంపూర్తిగా జరిగిన శస్త్రచికిత్స, రోగులను రేడియో అయోడిన్ వైద్యవిధానానికి రిఫర్ చేయటంలో జాప్యం కూడా రోగి ప్రాణాలకు సంకటంగా పరిణమిస్తోంది. కారణాలు ఖచ్ఛితంగా ఇప్పటికీ తెలియవు.