Search
Wednesday 21 November 2018
  • :
  • :

థైరాయిడ్ ముప్పుకి.. ఆరోగ్య సూత్రాలు

Thyroid Problems And Disease

మనం తినే ఆహార పదార్థాల వల్లనో, హోర్మోన్ల వల్లనో మన శరీరంపై  ప్రభావం చాలానే ఉంటుంది. ముఖ్యంగా థైరాయిడ్ గ్రంథి మన గొంతుభాగంలో ఉంటుంది. దాని పని తీరులో తేడాల వల్ల థైరాయిడ్ సమస్య ఎదురవుతుంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది. అందులో   ఒకటి ‘హైపో థైరాయిడిజం’.  ఈ రోజుల్లో థైరాయిడ్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. దీన్ని అదుపులో ఉంచాలంటే  వైద్యులు సూచించిన మాత్రలతోపాటు ఆహారపరంగానూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

లక్షణాలు : నీరసం, అలసట, మానసికంగా కుంగిపోవడం, బరువు పెరగడం, చల్లదనం భరించలేకపోవడం, అతి నిద్ర, బద్ధకం, జుట్టు రాలిపోవడం, చర్మం పొడిబారడం, కండరాల నొప్పులు, ఏకాగ్రత లోపించడం… వంటివి హైపో థైరాయిడిజం లక్షణాలు. ఇదో ఆటో ఇమ్యూన్ సమస్య. అయొడిన్ లోపం, ఒత్తిడి, జీవనవిధానంలో లోపాలు వంటివి కొన్ని కారణాలు. కొంతమందిలో ఇదీ కారణమని కూడా చెప్పలేం. ఈ సమస్యను అదుపులో ఉంచాలంటే థైరాయిడ్ గ్రంథి పనితీరుని ఇబ్బంది పెట్టే పదార్థాలను తగ్గించాలి. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, పాలకూర, ముల్లంగి, సోయాబీన్స్, బేరికాయ, స్ట్రాబెర్రీస్‌ను తినడం తగ్గించాలి. యోగాసనాల్లో మత్య్స, భుజంగ, బ్రహ్మముద్రసింహాసనం, జిహాముద్ర, అలాగే ఉజ్జయీ ప్రాణాయామం చేయడంతో ప్రయోజనం ఉంటుంది.
ఇంటివైద్యం
* హైపోథైరాయిడిజం సమస్యకు మునగాకు పనిచేస్తుంది. మునగాకు పప్పు లేదా పచ్చడిని రోజూ తినాలి. గ్లాసు నీటిలో గుప్పెడు మునగాకుల్ని కషాయంలా కాచుకుని నిత్యం తీసుకున్నా కూడా థైరాయిడ్ పనితీరు మెరుగవుతుంది.
* శొంఠి కొమ్ములను కొద్దిగా నేతిలో వేయించి, చల్లారిన తరువాత చూర్ణంలా చేసుకోవాలి. అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలో అరచెంచా శొంఠిపొడి, నెయ్యి కలిపి తినాలి. లేదా శొంఠి పొడితో కషాయం చేసుకోవాలి. 30 మి.లీ పరిమాణంలో రోజూ తీసుకోవచ్చు.
* శుద్ధ గుగ్గుల చూర్ణం 1-2 గ్రాములు, గోరువెచ్చటి నీటితో కలిపి తీసుకున్నా మార్పు ఉంటుంది.
4. లివర్‌లోని విష, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. లివర్ శుభ్రమవుతుంది.
5. ఉలవల్లో పుష్కలంగా ఉండే కాల్షియం ఎముకలకు, దంతాలకు బలాన్నిస్తుంది. వాటిని పటిష్టం చేస్తుంది.

Thyroid Problems And Disease

Telangana News

Comments

comments