Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

బెజ్జూర్ అడవుల్లో పులి కలకలం

                 Tiger

 బెజ్జూర్ : బెజ్జూర్ రేంజ్ పరిధిలోని అడవుల్లో పులి కలకలం రేపింది. రెండు అడవి పందులు, ఒక కోడెను హతం చేసిన పులి. బెజ్జూర్ మండలంలోని పెద్దసిద్ధాపూర్ గ్రామానికి చెందిన మడెబాపుకు చెందిన కోడె శనివారం నుండి ఆచూకి దొరకకపోవడంతో అతను వివిధ గ్రామాలలో ఆచూకి కోసం గాలించగా సిద్ధాపూర్‌కు 8 కిలోమీటర్లలో గల భీమన్న పాదాల ముందుగల ప్రాంతంలో పులిదాడిలో హతమైన కోడె కన్పించింది.

అది గమనించిన కోడె యజ మానికి మడెబాపు ఫారెస్టు అధికారులకు సమాచారం అందించడంతో ఫారెస్టు సెక్షన్ అధికారి వేణుగోపాల్ సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామ చేయించి పులిదాడిలో హతమైనట్లు తెలిపారు. ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందించడానికి బాధితుడికి భరోసా ఇచ్చారు.

Comments

comments