Home కుమ్రం భీం ఆసిఫాబాద్ బెజ్జూర్‌లో పెద్దపులి వదంతులు

బెజ్జూర్‌లో పెద్దపులి వదంతులు

                    Tiger

బెజ్జూర్ : బెజ్జూర్ మండలం గొల్లబాయి చెరువు సమీ పంలోని కల్వర్టు లో పెద్దపులి ఉందని సమీ పంలోని రైతులు బుధవారం ఉదయం పేర్కొన్నారు. దీంతో సమాచారం అందుకున్న మండల అటవీశాఖ అధికారి రాంమోహన్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చివరకు జంతువు బయటికి రాకపోవడంతో సీసీ కెమెరాల ద్వారా పైపులో ఉన్న జంతువును పరిశీలించగా అది పెద్దపులి కాదని ఏగోళమనే అటవీ జంతువువని అటవీశాఖ అధికారులు గుర్తించారు. పెద్దపులి ఉందన్న సమాచారం మేరకు సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఎఫ్‌డిఓ రవిప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. పెద్దపులి ఉందన్న సమాచారం మేరకు అనేక మంది ప్రజలు సంఘటనా స్థలంలో గుమిగుడారు.