Search
Tuesday 20 November 2018
  • :
  • :

పుస్తెలు తెంచే మూఢనమ్మకం ఎంతకాలం.. ఇంకెంత కాలం?

ప్రపంచాన్ని నడిపేవి రెండు. మొదటిది నమ్మకమైతే, రెండోది మూఢనమ్మకం. అలాగని మూఢనమ్మకమే ప్రధాన పాత్ర పోషిస్తే జీవనం దినదినగండంగా మారి మన నీడను మనమే నమ్మలేని స్థితి ఏర్పడుతుంది. అలాంటి మూడనమ్మకమే ఒకటి ప్రస్తుతం రాష్ట్రాలుదాటి  మన జిల్లాలకు చేరింది.  పుస్తెలతాడులో పగడం ఉంటే భర్త చనిపోతాడన్న  మూఢనమ్మకం రాష్ట్రంలోని పలుజిల్లాల మహిళల్లో  భయాందోలనలను కల్గిస్తోంది. పగడమే పడగై వెంటాడుతోందన్న నమ్మకం వారిని కంసాలీల వద్దకు పరుగులెత్తించి పుస్తెలు తెంచుకునేవరకు తీసుకెళుతోంది. ఇంకొందరు మితిమీరిన భయంతో స్వచ్ఛందంగా మంగళ సూత్రాలు తీసేసి తమ మాంగళ్యాలు బలంగా ఉండాలని దేవుళ్లను ప్రార్థిస్తున్నారు. ఊహలు, అపోహలు ఎంతటి అనర్థానికైనా దారితీస్తాయనడానికి ఈ తాజా ఉందంతాలే ఉదాహరణలు…

Mangala-Sutra

మూఢనమ్మకాలు భారతదేశంలో ఒక సామాజిక సమస్య. ఇది మానవాతీతశక్తులకు, ఆధునిక శాస్త్ర పరిజ్ఞానా నికి మధ్య జరిగే యుద్ధం. మానవాతీత శక్తులను విశ్వసించే ప్రజల ప్రవర్తన లేదా వారి నమ్మకాలు వారి జీవన విధానాన్ని నిర్దేశిస్తున్నాయి. ప్రజల విశ్వాసాలకు, శాస్త్రజ్ఞుల అభిప్రాయాల కు మధ్య అంతరం చాలా ఉంది. సాధారణంగా నిరక్షరాస్యతనే మూఢనమ్మకాలు ప్రబలడానికి మొదటి కారణమైతే, వేళ్ళూను కుని పోయిన విశ్వాస వ్యవస్థ రెండవది. ఇది వ్యక్తి వైఖరులు, నమ్మకాలపై ఏర్పరిచిన ఒక వ్యవస్థ. సాధారణంగా కుటుంబం లేదా సమాజాలు అనుసరించే సంస్కృతిలో మతం, తాత్విక దృక్పథం, కర్మలు వారి భావజాలం అన్నీ ఇమిడి ఉంటాయి. ఇవి వ్యక్తి ఆలోచనలను, ప్రవర్తనలను ప్రభావితం చేసి వ్యక్తిత్వం రూపుదిద్దుకోవడానికి దోహదపడతాయి. నమ్మకాలు ఒక సమా జానికి మరో సమాజానికి, ఒక మతానికి మరో మతానికి భిన్నం గా ఉంటాయి. ఒక మతం ఒప్పుకున్న దాన్ని ఇంకో మతం ఒప్పు కోకపోవచ్చు. కొన్ని ఆచార వ్యవహారాలు తరతరాలుగా సంస్కృతిలో భాగమై ఉండవచ్చు. అందువలన ఇవి మూఢనమ్మ కాలని వీటిని పాటించనవసరం లేదని ప్రజలను ఒప్పించటం కష్టం. మరికొన్నింటిని సమాజంలోని కొందరు వ్యక్తులు వారి స్వలాభం కోసం సృష్టిస్తున్నారు.
ఉదా : అక్కాచెల్లెళ్లు చీరలు పెట్టుకోవటం, అక్కాచెల్లెళ్ళు మూడు రంగుల గాజులు మార్చుకోవటం, సంక్రాంతి పురుషుడు సరైన సమయంలో ప్రవేశించలేదని అందువలన ఇంటి గడపకు తప్ప నిసరిగా కొబ్బరికాయలు కాల్చాలని, గణపతికి పాలు తాగించా లని ఇప్పుడు మంగళసూత్రల్లో పగడాలు ఉండకూడదని! ఈ మూఢనమ్మకం కర్ణాటక నుంచి వచ్చి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు చేరింది. వీటివల్ల వస్త్ర, గాజుల, కొబ్బరికా యల, పాల వ్యాపారులు లబ్ధి పొందారే తప్ప సమాజానికి ప్రజలకు నష్టమే తప్ప లాభం లేదు.
ఇవే కాకుండా ఆధ్యాత్మిక గురువుల ముసుగులో కొందరు బాబాలు, స్వాములు చేసే కొన్ని మానసిక శక్తులు లేదా గారడీలు మొదలైనవి సమాజాన్ని ఇంకా అధోగతికి దిగజారుస్తున్నాయి. భవిష్యత్తును గురించి చెప్పడం, ఎదుటి వ్యక్తి ఆలోచనలను పసిగట్టి వాటిని బహిర్గతం చేయడం, చనిపోయిన వ్యక్తుల నుండి మాటలను వినటం మొదలైనవి వారి మానసిక శక్తులుగా బాబాలు చెప్పుకోవటం నిజంగా సిగ్గుచేటు. ఆధ్యాత్మిక గురువులు ప్రజలను ప్రశాంత జీవనానికి అలవాటు చేయడానికి బదులుగా వారిలో ఒక రకమైన భయాందోళనలు సృష్టిస్తూ, అలజడికి గురిచేస్తున్నారు. దాంతో ప్రజలు అయోమయానికి గురిఅవుతున్నారు. ప్రజలలోని తామస గుణాన్ని నశింపజేసి ద్వేషం, అసూయ, పగ, ప్రతీకారం లేని ప్రశాంతజీవనాన్ని గడిపేందుకు ఆధ్యాత్మికత తోడ్పడాలి. ఆధ్యాత్మిక గురువులు ఆ దిశగా చేసే ప్రతి ప్రయత్నం ఆమోదయోగ్యమే కాని మాయలు, గారడీలు కావు.
ఈ మూఢనమ్మకాలను, గారడీవాళ్ళను సమాజం నుండి సంపూర్ణంగా తొలగించకుండా, మనం కలగన్నట్లుగా భారతదేశం ప్రపంచంలో అత్యున్నతశక్తిగా మారలేదు. వాటిని పారద్రోలడానికి పిల్లల్లో శాస్త్రీయ దృక్పథం పెంచే విద్యావిధానం ఉండాలి. ప్రసారమాధ్యమాలను వేదిక చేసుకొని వాటి ద్వారా విస్తృతంగా అవగాహన కల్పించాలి. అసలు మూఢనమ్మకాలు ఎలా పుట్టాయి, అంతరార్థం ఏంటి అని తెలుసుకోవటం ద్వారా అవి పాటించాలా వద్దా అనే నిర్ణయం మనం తీసుకోగలు గుతాము.
ఉదా : నిచ్చెన కింద నుండి నడవద్దు అని చెప్తారు. దీనికి కారణం నిచ్చెన జారి మన మీద పడవచ్చు, లేదా నిచ్చెనపైన ఎక్కి పనిచేసేవారి చేతిలోని పనిముట్లు మన మీద పడి ప్రమాదం జరగొచ్చు. అలాగని నిచ్చెన కింద నుండి నడవకపోవటం మూఢనమ్మకం కాదు, ముందుజాగ్రత్త అని తెలుస్తుంది. అలాగే పిల్లలు పడుకుని ఉన్నప్పుడు ముద్దు పెట్టుకోవద్దు, వారిపై నుండి నడవకూడదు ఇలాంటివి ముందు జాగ్రత్త చర్యలే కాని మూఢ నమ్మకాలు కావు. ఒకవేళ మనకు మూఢనమ్మకాల్లో హేతుబద్ధత కనిపించకపోతే వాటిని వదిలేయాలి. మూఢనమ్మకాల వలన మనకు కలిగే అసౌకర్యం ఎలాంటిదో గుర్తించటం వలన కూడా వాటిని వదిలేయగలుగు తాము. నిర్ణయాలు తీసుకునే తార్కిక ఆలోచనాశక్తి మనకు ఉన్నదని మనం నమ్మినప్పుడు మూఢన మ్మకాలను విడిచిపెట్టగ లుగుతాము. మనకు ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం ఉంటే ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తా ము. అలాకాకుండా మంచే జరుగుతుంది అని నమ్మితే ఏ రకమైన భయాలైనా దరికి చేరవు. మూఢనమ్మకాల్ని విశ్వసిం చడం ఒసిడి( అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ) అనే మానసిక వ్యాధికి సూచన అని మరిచిపోవద్దు.

– ఎన్ క్రిష్ణవేణి, సైకాలజిస్ట్, షీ టీమ్స్ భరోసా.

Comments

comments