Home ఆఫ్ బీట్ టిపు: ద గాడిద@ 10 లక్షలు

టిపు: ద గాడిద@ 10 లక్షలు

Tippu the donkey has a price tag of Rs 10 lakh

అది హర్యానాలోని మారుమూలలోని చిన్న ఊరు. దాన్ని పేరు నయా బాన్స్. కానీ ఈ ఊరు పేరు కంటే టిపు ఊరు అంటేనే చాలా మంది గుర్తుపడతారట. టిపు అంటే అతనేవరో ఆ ఊరి బాగు కోసం పాటుపడిన వక్తి అనుకుంటే పోరబడినట్టే. ఎందుకంటే అది మనిషి పేరు కాదు. ఓ గాడిద పేరు. అవును మీరు విన్నది నిజమే. అది గాడిద పేరే. ఎందుకు ఆ గాడిద పేరు అంతా ఫేమస్ అయిందనేగా మీ అనుమానం. అయితే మీరు టిపు కథ తెలుసుకోవాల్సిందే. మాములుగానైతే ఏదైనా గాడిద నాలుగు నుంచి ఐదు అడుగు పొడువుతో 200 నుండి 300 కిలోల బరువుతో ఓ రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు పలుకుతుంది. కానీ, టిపు అలా కాదండోయ్. టిపు స్పెషాలిటీనే వేరు. టిపు ఏకంగా 10 అడుగుల పొడవుతో 400 కిలోల బరువు ఉంటుంది. అలాగే దీని ఖరీదు కూడా చాలా ఎక్కువనే చెప్పాలి. ఈ గాడిదను దాన్ని యజమాని ధరమ్ వీర్ ఓ సంతకు తీసుకెళ్లగా ఏకంగా రూ. 10 లక్షలు పలికిందట. కానీ ధరమ్ మాత్రం టిపును అమ్మ లేదట.

ఇక ఇలాంటి సూపర్ క్వాలిటీ గాడిద ధరమ్ వీర్‌కు ఎలా దక్కిందో తెలుసా? నయా బాన్స్‌లో దాదాపు అందరూ గాడిదల వ్యాపారం చేస్తుంటారు. ఈ క్రమంలో ఒకసారి గాడిదల వ్యాపారి రాజుభాయ్ యొక్క తండ్రి ఇటాలియన్ బ్రీడ్‌తో అమృత్‌సర్ గాడిదతో క్రాసింగ్ చేయించారట. అలా వచ్చిన టిపును ధరమ్ వీర్ దక్కించుకున్నాడు. టిపు రోజువారి మెను కూడా చాలా వేరుగానే ఉంటుంది. రోజు ఉదయం ఊరిలోని చెరువుకు తీసుకెళ్లి శుభ్రంగా కడుగుతారు. అనంతరం బెల్లం, నల్లశెనగలతో కూడిన మెత వేస్తారు. అలా టిపు రోజువారి దిన చర్య ఉంటుంది. అలాగే టిపు ఆదాయం కూడా ఎక్కువే. అది ఎలాగంటారా? టిపుతో క్రాసింగ్ కోసం హర్యానా, పంజాబ్, రాజస్థాన్‌తో చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ఆడ గాడిదలను తీసుకువస్తారట. ఇలా ఇప్పటి వరకు 60 గాడిదలతో టిపు డేటింగ్ చేసింది. మంచి పని కదా అని ఫ్రీగా చేయడం లేదు ధరమ్ వీర్. ఒక్కొ గాడిదకు క్రాసింగ్ కోసం రూ. 40,000 తీసుకుంటున్నాడు. ఇప్పటి వరకు టిపు సుమారు రూ. 20 లక్షల వరకు సంపాదించిందని యజమాని చెబుతున్నాడు. ఇలా టిపు ఇప్పుడు ఇండియా యొక్క సూపర్ స్టార్ గాడిదగా మారిపోయింది.