Home జోగులాంబ గద్వాల్ తీరుమారని..తిరునాళ్లు

తీరుమారని..తిరునాళ్లు

cow

*నమోదైన 5కేసుల్లో 11 మంది గుర్తింపు
పరారీలో మరికొందరు
*తహసీల్దారు ఎదుట రెండు కేసుల్లో
16 మంది బైండోవోర్
*వివాదస్పదంగా మారిన ఉత్తనూరు, టి.టిదొడ్డి జాతర్లు
గుర్రుగా ఉన్న జిల్లా పోలీసు బాసు

మన తెలంగాణ/ గద్వాలప్రతినిధి: తిరు నాళ్లు.. జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ప్రత్యేక సాంప్రదాయం…గట్టు, మల్దకల్, ధరూరు, గద్వాల, అయిజ, ఇటిక్యాల, మానోపాడు, వడ్డేపల్లి తదితర మండలాల్లో పెద్ద ఎత్తున తిరునాళ్లు జరగడం కొన్ని దశాబ్దాలుగా వస్తు న్న ఆనవాయితీ…ఈ జాతరలో రథం ఊరే గింపులు, సాంప్రదాయ గ్రామీణ క్రీడలు, మిఠాయి అంగళ్లు, రంగులరాట్నాలు ఇలా వారం పదిరోజుల పాటు జాతర్లో జనాలతో సందడే..సందడి ఇదీ తిరునాళ్లల్లో నాణ్యానికి బయటకి కనిపించే ఒక కోణం  అయితే ఇదే జాతర పేరిట కొందరు పండుగ చేసుకుంటారు. ఏమ ప్పా… మాఊరి జాతర వచ్చింది… పోయినసారి జాతరకు డబ్బు లిచ్చిన వాళ్ల లిస్టు తీశాం… అందులో నీపేరు… నంబరు కనబడిం ది… ఈసారి కూడ మమ్ముల్ని మర్చిపోవద్దు… కాదు.. కూడదంటే నీఇష్టం… అంటూ జాతర పేరిట బలవంతపు వసుళ్లూ… బెదిరింపు లు… వెరసి గళ్లపెట్టెలను నింపుకుని ఎడాదిపాటు ఫుల్లుగా జాతరే… జాతరే… ఇదీ గత కొంత కాలంగా కొందరు వ్యక్తులు జాతర పేరిట కొనసాగిస్తున్న కాసుల దంధా. ఈఅక్రమ కాసుల దంధాపై జిల్లా పోలీసు బాసు దృష్టి సారించారు. బలవంతపు వసూళ్లపై ఆగ్రంగా ఉన్నారు. వీరి భరతం పట్టేపనిలో నిమగ్నమైయ్యారు.
వివాదస్పదంగా మారిన ఉత్తనూరు జాతర: ఇంతకు ముందు చెప్పు కున్నట్లు నడిగడ్డ జిల్లాల్లో జాతర్లు జరగడం ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం అని. అయితే అయిజ మండలం ఉత్తనూరులో జరిగి న జాతర వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ముఖ్యంగా సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం పశువుల బలప్రదర్శన చట్టవిరుద్ద మని పేర్కోంటూ… చట్టవిరుద్దంగా ఎవరైన ప్రవర్తిస్తే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామంటూ అయిజ పోలీసులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. కాని పోలీసు హెచ్చరికలను భేఖాతరు చేస్తూ జాతర నాడు ఎద్దులతో బండలాగుడు పోటీలు జరిగాయి. ఈపోటీలను మంత్రి జూపల్లికృష్ణారావు చేతుల మీదుగా ప్రారంభిం చడం జరిగింది. ముందుస్తు హెచ్చరికలు చేసినప్పటికీ చట్టవిరుద్దంగా ఎద్దుల పోటీలను నిర్వహించడంపై పోలీసులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. దీనికి బాధ్యులైన వారిపై వరసుగా కేసులు నమోదు చేశారు. అయితే అటు తిరిగి ఇటు తిరిగి ఈవివాదం కాస్త మంత్రి జూపల్లి కృష్ణారావుకు చుట్టుకుంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, చట్టాన్ని కాపాడాల్సిన రాష్ట్ర మంత్రే ఇలా చట్టాలను చులకన చేయ డం, వాటికి తిలోదకాలు ఇవ్వడంపై స్థానికంగా ఉండే కొన్ని ప్రజా సంఘాలు, ఎమ్మార్పీఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. మంత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలంటూ అయిజకు చెందిన ఎమ్మార్పీఎస్ ప్రతినిధి రాజు పోలీసులకు ఫిర్యాదు సైతం చేశారు.
గుర్రుగా ఉన్న పోలీసుబాసు: ఇదిలా ఉండగా చట్టవిరుద్ధమైన పనులు చేయడం, అందులో పాల్గొనడం సరైన విధానం కాదని పోలీ సులు ముందస్తు హెచ్చరికలు చేసినప్పటికీ పెడచెవిన పెట్టడం పట్ల పోలీసు బాసు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అయిజ మండలంలోని టీ.టీ.దొడ్డి, ఉత్తనూరు జాతర్లల్లో చట్టవిరుద్ధంగా ప్రవర్తించిన వారిపై మొత్తం 5 కేసులు నమోదైయ్యాయి. ఇందులో ఇప్పటి వరకు 11మందిని గుర్తించగా, మరికొందరు పరారీలో ఉన్నట్లు అయిజ ఎస్‌ఐ వెంకటరమణ మనతెలంగాణకు తెలిపారు. మరో రెండు కేసుల్లో 16మందిని తహశీల్దార్ ఎదుట బైండోవోర్ చేసినట్లు, ఒక్కో క్కరు రూ.1లక్ష చొప్పున కట్టాలని వివరించారు. ఇంకా విడియో క్లిపింగుల ఆధారంగా మరికొందరిపై కేసులు నమోదు చేస్తామని ఎవ్వరిని ఉపేక్షించేది లేదని వివరించారు. అయితే జాతరల్లో చోటు చేసుకున్న మొత్తం వివాదంపై పోలీసు బాసు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిసింది. చూడాలి ఇందులో ఎన్నికేసులు నమోద వుతాయ్యో, ఇంకెంతమంది అరెస్టు అవుతారో..?