Home సినిమా జయలలితగా త్రిష

జయలలితగా త్రిష

Trisha

‘మహానటి’ చిత్రం తర్వాత బయోపిక్‌లపై ఇటు ప్రేక్షకుల్లో… అటు ఫిల్మ్‌మేకర్స్‌లో ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. తెలుగులో ఇప్పటికే ఎన్టీఆర్, వైఎస్‌ఆర్‌ల బయోపిక్‌లు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తరహాలోనే సినీ, రాజకీయ రంగాల్లో తిరుగులేని హవా కొనసాగించిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథతో ఓ బయోపిక్ రాబోతున్నట్లుగా కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పాత్ర ఎవరు చేస్తారనే విషయంలో స్పష్టత లేదు. కీర్తిసురేష్, త్రిష పేర్లు తెరమీదకు వచ్చాయి. అయితే కీర్తి తనకు ఈ చిత్రం చేసే ఉద్దేశం లేదని తేల్చేయగా త్రిష మాత్రం తాను జయలలిత పాత్ర చేయడానికి సిద్ధమని ప్రకటించింది. “నాకు జయలలిత అంటే చాలా ఇష్టం. అందుకోసమే ఈ సినిమా చేయాలనుకుంటున్నాను. పదేళ్ల వయసులో నేను స్కూల్లో చదువుకుంటున్నప్పుడు జయలలిత మా పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. అప్పటినుంచి ఆమె అంటే నాకిష్టం”అని పేర్కొంది త్రిష.