Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

మెగాస్టార్ బర్త్‌డేకు టైటిల్, ఫస్ట్‌లుక్

Ram-Charan

బ్లాక్‌బస్టర్ హిట్ ‘రంగస్థలం’ తర్వాత రామ్‌చరణ్ ప్రస్తుతం తన 12వ చిత్రంలో నటిస్తున్నాడు. మాస్ చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం టైటిల్, ఫస్ట్‌లుక్‌ను మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22న విడుదల చేయనున్నారని తెలిసింది. అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న విడుదల చేస్తారని సమాచారం. ఇప్పటికి 60 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకున్న ఈ చిత్రంలో చరణ్ సరసన ‘భరత్ అనే నేను’ ఫేమ్ కియారా అద్వాని కథానాయికగా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను అక్టోబర్ నాటికి పూర్తిచేయాలని ఫిల్మ్‌మేకర్స్ నిర్ణయించుకున్నారు. దానయ్య డివివి నిర్మిస్తున్న ఈ చిత్రం తర్వాత చరణ్… రాజమౌళి తెరకెక్కించనున్న మల్టీస్టారర్ చిత్రంలో ఎన్టీఆర్‌తో కలిసి నటించనున్నాడు.

Comments

comments