Search
Friday 16 November 2018
  • :
  • :

భేరీ నోరు మూయించే దుస్సాహసం

Dharna-Chowk

ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్ సాధన ఆందోళన, సచార్ కమిటీ అమలు, అవినీతి వ్యతిరేక ఉద్యమం వంటి అనేక ఉద్యమాలు ఇక్కడనే జరిగినాయి. ధర్నా చౌక్ లేకుంటే తెలంగాణ ఉద్యమాన్ని ఊహించనే లేము. ఆయా పార్టీల ఎం.ఎల్.ఎలు తెలంగాణ కొరకు దాదాపు 3 వారాలు పాటు ఇక్కడనే దీక్షలు చేసినారు. అనేక సంఘాలు, పార్టీలు తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ఇక్కడే ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారు. ప్రస్తుత ముఖ్యమంత్రిగారు కూడా ఎన్నో సార్లు ఇక్కడ ధర్నాలలో పాల్గొన్నారు.

16 సంవత్సరాల పాటు ఎప్పుడూ నినాదాలతో, ఉపన్యాసాల హోరుతో మారుమ్రోగిపోయిన ధర్నా చౌక్‌లో మార్చి 1 నుండి నిశ్శబ్దం ఆవరించింది. సమస్యలన్నీ పరిష్కారం కావడం వలన ధర్నాలు ఆగిపోలేదు. ప్రభుత్వం నగరంలో ఎక్కడా నిరసన కార్యక్రమాలు జరుగరాదని నిరంకుశమైన ఆంక్షలు విధించడంతో అన్ని ఆందోళనా కార్యక్రమాలు నిలిచిపోయాయి. చంద్రబాబు పాలనా కాలంలోనే ధర్నా చౌక్ ఏర్పడింది. అంతకు ముందు ధర్నాలన్నీ సెక్రటేరియట్ ముందు జరిగినాయి. వాస్తవానికి స్వాతంత్య్రానంతరం అసెంబ్లీ ముందే ధర్నాలకు అనుమతించే వారు. కోఠిలోని పార్కులలోనూ సభలు, సమావేశాలు, ధర్నాలు జరిగేవి. క్రమంగా అన్ని ధర్నాలను సెక్రటేరియట్‌కు పరిమితం చేసినారు.

ఆ తరువాత ఇందిరా పార్కుకు ధర్నా చౌక్‌ను తరలించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని పౌర హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు, పార్టీలు తీవ్రగా వ్యతిరేకించినాయి. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. క్రమంగా న్యాయ సమ్మతమైన డిమాండ్ల సాధన కోసం, తమ ఆలోచనలను ప్రపంచానికి తెలియజెప్పాలనుకునే అన్ని సమూహాలకు ఇందిరా పార్క్ వేదిక అయింది. ఎవ్వరికీ ఇబ్బంది కలుగకుండా కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నారు. గత 16 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలకు ధర్నా చౌక్ వేదికగా నిలిచింది. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్ సాధన ఆందోళన, సచార్ కమిటీ అమలు, అవినీతి వ్యతిరేక ఉద్యమం వంటి అనేక ఉద్యమాలు ఇక్కడనే జరిగినాయి. ధర్నా చౌక్ లేకుంటే తెలంగాణ ఉద్యమాన్ని ఊహించనే లేము. ఆయా పార్టీల ఎం.ఎల్.ఎలు తెలంగాణ కొరకు దాదాపు 3 వారాలు పాటు ఇక్కడనే దీక్షలు చేసినారు. అనేక సంఘాలు, పార్టీలు తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ఇక్కడే ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారు. ప్రస్తుత ముఖ్యమంత్రిగారు కూడా ఎన్నో సార్లు ఇక్కడ ధర్నాలలో పాల్గొన్నారు.

ఇప్పుడు ప్రభుత్వం ధర్నా చౌక్‌ను నగరం వెలుపలకు తరలించనున్నది. ఒక్కటి కాదు నాలుగు ధర్నా చౌకులు ఏర్పాటు చేస్తుందట. రింగ్ రోడ్డు వెంబడి నగరానికి నాలుగు దిక్కుల నాలుగు చోట్ల ధర్నాలకు అవకాశం ఇస్తారట. ఇక మన నినాదాలు, ఉపన్యాసాలు అరణ్య రోదనగా మిగిలిపోనున్నాయి. ప్రపంచమంతటా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నగరం నడిబొడ్డున జరుగుతాయి. మన దేశంలోనే ఢిల్లీలో పార్లమెంటుకు కూతపెట్టు దూరంలోని జంతర్‌మంతర్ వద్దనే నిరసనకు అవకాశం ఉన్నది. లండన్‌లోని హైడ్ పార్క్‌లో అనుమతి లేకుండానే సభలు, సమావేశాలు, ర్యాలీలు జరుపుకుంటారు. అమెరికాలో పోలీసులకు సమా చారం ఇచ్చి అమెరికా అధ్యక్షుని నివాసం వైట్ హౌస్ ముందు నిరసన తెలుపవచ్చు. ఈ మధ్యనే ట్రంప్ ఎన్నికను నిరసిస్తూ వేలాది మంది ర్యాలీలు నిర్వహించారు.

నిరసన ప్రజాస్వామ్యంలో ప్రజలకున్న హక్కు. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) ప్రకారం పౌరులందరికీ శాంతి యుతంగా సమావేశం కావడానికి, భావ ప్రకటన హక్కు ఉన్నది. ఈ హక్కు ప్రకారమే ధర్నాలు జరుపు కోవచ్చు. సుప్రీంకోర్టు ప్రజలు సమిష్టిగా కలుసుకొని అభి ప్రాయాలు పంచుకునే వాతావరణం లేకపోతే ప్రజా స్వా మ్యం నిలబడలేదని అన్నది. సమావేశాలు, ధర్నాలు ద్వారా ప్రజలు తమ సమస్యలను ప్రపంచానికి తెలియజెప్పే అవ కాశం కలుగుతుంది. అంతేకాదు అనేక విష యాలు తెలుసుకొని పౌరులు సమాజంలో తమ పాత్రను మరింత బాధ్యతతో నిర్వహించటానికి సమావేశాలు ఉపయోగ పడ తాయి. సమావేశాలు ప్రజలను చైతన్యవంతు లను చేస్తాయి. నిరసన కార్యక్రమాలకు బహిరంగ వేదికలు అవసరం. స్వాతంత్య్రోద్యమ కాలంలో రోడ్లు నిరసనలకు వేదికలయ్యాయి. తెలంగాణ ఉద్యమంలో కరెంటు కోతలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర సమితి హైదరాబాద్ శివారుల నుండి మంచిర్యాల దాకా రోడ్లపైన మహాధర్నా నిర్వహించింది. ఉద్యమ కాలంలో అనేక సార్లు రోడ్లపైన వంటా- వార్పు కార్యక్రమాలు జరిగినాయి. ఈ కార్యక్రమాలు జరుగకుండా తెలంగాణ వచ్చేది కాదు. నిరసన కార్యక్రమాలు ప్రజాస్వామ్యాన్ని పదిలంగా ఉంచుతాయి.

సుప్రీంకోర్టు నిరసన కార్యక్రమాలు జరుపుకునే హక్కు ఆర్టికల్ 19(1) నుంచి ఉద్భవించిందన్న విషయాన్ని అంగీకరించింది. ఈ హక్కుపై పరిమితులు విధించే అధికా రం ప్రభుత్వానికి ఉన్నది. కాని ప్రభుత్వానికి శాంతి భద్రతల పేరుతో సభలు, సమావేశాలకు, ధర్నాలకు అనుమతిని నిరాకరించే అధికారం లేదని కోర్టు పేర్కొన్నది. నియంత్రణా ధికారాన్ని చాలా జాగ్రత్తగా ఉపయో గించాలని, కేవలం హక్కులను విస్తృత పరిచే లక్షంతో ఉపయోగించాలని కోర్టు స్పష్టం చేసింది. విచక్షణా రహిత అణచివేతకు, నియంత్రణకు మధ్యనున్న తేడాను గుర్తించి కార్యనిర్వహణ శాఖ తన అధికారాలను ఉపయోగించాలని సూచించింది. నియంత్రణాధికారాలు నిరంకుశత్వానికి దారి తీయరాదు. అవి కేవలం రాజ్యాంగంలోని లక్షాల సాధనకే ఉపయోగపడాలి.

కాని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామిక స్వేచ్ఛనే మంటకలిపే రీతిలో తన అధికారాలను ఉపయో గిస్తున్నది. ధర్నాచౌకు మూసివేత ప్రభుత్వ అసహనానికి, నిరంకుశధోరణికి గుర్తుగా మిగిలిపోతది. ప్రభుత్వం తన అధికారాన్ని ఇష్టానుసారం, నిరంకుశంగా ఉపయోగిం చడానికి వీలు లేదు. గతంలో జాగీర్దార్లు అధికారాన్ని స్వంత ఆస్తిగా చూసినట్లే ఇప్పటి పాలకులు కూడా ప్రభుత్వాన్ని స్వంత వ్యవస్థగా చూస్తున్నారు. రాజ్యాంగం విధించిన పరిమితులను మరిచిపోతున్నారు. ప్రభుత్వ అధికారం ఈ వాతావరణంలో స్వంత ప్రయోజనాలకు సాధనమైంది. మరి ఈ వాతావరణంలో గతంలోని జాగీర్దార్లు, దొరల వలె వీరు కూడా ప్రజలకు నిరసన హక్కు ఉందన్న విషయాన్ని గుర్తించ డం లేదు. ప్రజలు పడి ఉండాలి, చేసింది చూస్తూ ఉండాలి. నచ్చితే పాలాభిషేకం చేయాలి. అంతేకాని ప్రశ్నించకూడదు.

అందుకే ధర్నాచౌక్‌లు వద్దు, సభలు, సమావేశాలు నిజాం కళాశాల మైదానాలు వద్దు. అన్నీ మూతపడాలి. ఎవరూ మాట్లాడవద్దు. ఈ నిరంకుశ ధోరణి ఫలితంగా వచ్చిందే ధర్నాచౌక్ మూసివేత నిర్ణయం. ధర్నాచౌక్‌ను కాపాడుకోవడమంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం అన్న విషయాన్ని గుర్తించాలి. వాస్తవానికి తెలంగాణ ఉద్యమమే ప్రజస్వామ్య పరిరక్షణ ప్రభుత్వ కర్తవ్యంగా ముందుకు తీసుకొచ్చింది. అందువల్లనే టిఆర్‌ఎస్ తన మేనిఫెస్టోలో “ప్రజాస్వామిక మైన కార్యక్రమాలను ఎవరు చేపట్టినా వారికి ఎలాంటి అవరోధం లేని విధంగా వారి హక్కు లను కాపాడే విధంగా పరిపాలన ఉంటుం ది. ప్రజలు శాంతి యుతంగా అహింసా మార్గంలో ఉద్య మిం చే హకు అమల య్యే వాతావ రణం నిర్మి స్తుంది అని రాసు కున్నది. తన మానిఫెస్టోలోని ఈ వాక్యాలను టిఆర్‌ఎస్ మరిచిపోయింది.

kodanda-ram-ఎం.కోదండరామ్, తెలంగాణ జెఎసి ఛైర్మన్

Comments

comments