Home కరీంనగర్ కోదండరామ్ అరెస్టు

కోదండరామ్ అరెస్టు

TJS Chief Kodandaram arrested at Karimnagar

కరీంనగర్ : తెలంగాణ జన సమితి అధినేత కోదండరామ్‌ను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. సడక్ బంద్‌లో భాగంగా ఆందోళన పాల్గొన్న ఆయన్ను కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. రైతుల సమస్యలపై తెలంగాణ రైతు సంఘాలు సడక్ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఖమ్మం నుంచి కరీంనగర్ వరకు ఆందోళనలు చేశారు. ఎల్కతుర్తి వద్ద కోదండరామ్ ఆందోళన చేశారు. వీరి ఆందోళనకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో కోదండరామ్‌తో పాటు ఆ పార్టీ నేతలు గాదె ఇన్నయ్య, వెంకట్‌రెడ్డి, సిపిఐ అగ్రనేత చాడ వెంకట్‌రెడ్డి తదితరులను అరెస్టు చేసి హసన్‌పర్తి పోలీసు స్టేషన్‌కు తరలించారు.

TJS Chief  Kodandaram arrested at Karimnagar