Search
Sunday 23 September 2018
  • :
  • :

వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ : కోదండరామ్

TJS Chief Kodandaram Comments on 2019 Elections

హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో తెలంగాణ జన సమితి ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ వెల్లడించారు. తెలంగాణలోని 119 స్థానాల్లో తాము పోటీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము కింగ్ మేకర్లం కామని, కింగ్‌గానే ఉంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో హంగ్‌కు అవకాశం లేదని, పూర్తి మెజార్టీతో తాము అధికారంలోకి వస్తామని ఆయన స్పష్టం చేశారు. కర్నాటకలో జాతీయ పార్టీలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చకపోవడం వల్లనే ఆ రకమైన ఫలితాలు వచ్చాయని ఆయన చెప్పారు. పెట్రోలు, డిజిల్ ధరల పెరుగుదల కారణంగా వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామని ఆయన వెల్లడించారు.

TJS Chief Kodandaram Comments on 2019 Elections

Comments

comments