Home తాజా వార్తలు టిఆర్‌ఎస్‌కే మాదిగల మద్దతు : వంగపల్లి

టిఆర్‌ఎస్‌కే మాదిగల మద్దతు : వంగపల్లి

TMRPSసూర్యాపేట : వచ్చే లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు తెలంగాణ ఎంఆర్ పిఎస్ పూర్తి మద్ధతు తెలుపుతుందని ఆ సంఘం తెలంగాణ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ తేల్చి చెప్పారు. సూర్యాపేట టిఆర్ఎస్ కార్యాలయంలో మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని వంగపల్లి శ్రీనివాస్ తన మద్దతుదారులతో కలిశారు. ఈ సందర్భంగా వంగపల్లి మాట్లాడారు. ఎస్ సి వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టడమే కాకుండా పార్లమెంట్ లో బిల్లును పాస్ చేయించేందుకు సిఎం కెసిఆర్ కృషి చేశారని వంగపల్లి తెలిపారు. ఈ క్రమంలోనే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు చెందిన 16 మందిని ఎంపిలుగా గెలిపిస్తే, వర్గీకరణ బిల్లను పార్లమెంట్ లో ఆమోదించుకునే అవకాశం వస్తుందని ఆయన చెప్పారు. టిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు మాదిగలు సహకరించాలని ఆయన కోరారు. వర్గీకరణకు కాంగ్రెస్, బిజెపి పాలకులు పట్టించుకోలేదని ఆయన ధ్వజమెత్తారు.  మంత్రి జగదీష్ రెడ్డిని కలిసిన వారిలో వంగపల్లి శ్రీనివాస్ తో పాటు  టిఎంఆర్ పిఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి చింతాబాబు మాదిగ, రాష్ట్ర అధికార ప్రతినిధి కత్తుల తులసి దాస్ మాదిగ , దైదా రవి మాదిగ,మేడి నర్సింహ మాదిగ, జొన్న పాల రమేష్ మాదిగ, నరేందర్ మాదిగ ,సైదులు మాదిగ, కృష్ణ బాబు మాదిగ, రమేష్ మాదిగ తదితరులు ఉన్నారు.

TMRPS Support for TRS : Vangapalli