Home ఆఫ్ బీట్ నిరంతరం చురుగ్గా ఉండాలంటే..

నిరంతరం చురుగ్గా ఉండాలంటే..

lf

మెదడుకు మేతలాంటి పజిల్స్‌ను మ్యాగజైన్స్‌లో చూస్తుంటాం. చాలా మందికి వీటిని పూర్తిచేయడం అంటే ఎంతో ఇష్టం. పదాలతో ఆడుకోవడం, కొత్త అర్థాలు తెలుసుకోవడం వీరికి చాలా సరదా. అలాగే కొత్తకొత్త విషయాలు తెలుసుకోవాలన్న కుతూహలంతో కొందరు పుస్తకాల పురుగుల్లా చదువుతూనే ఉంటారు. మరికొందరు ఎవరైనా ఏదైనా చెబుతుంటే విని కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఇంకొంతమంది అనుభవజ్ఞుల ద్వారా తెలియని విషయాలను నేర్చుకుంటారు. సోమరిగా ఉండడం కన్నా ఏదో ఒక పనిచేయడం మేలు. ఏదో ఒక పనిచేయడం కన్నా అర్థవంతమైన పనిచేయడం అంతకన్నా మంచిది. చేసేది మన ఆసక్తికి, అభిరుచికి సంబంధించిందైతే మరీ మంచిది. బ్రెయిన్ చురుగ్గా ఉండాలంటే దానికి ఎప్పటికప్పుడు పదును పెట్టుకోవాలి. అందుకు కొత్త విషయాలను తెలుసుకోవడం ఒక్కటే మార్గం. నేర్చుకోవడంలో తప్పులు దొర్లినా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉత్తమంగా చదువుకోవడానికి, ఉన్నతంగా ఎదగడానికి అది సహాయపడుతుంది.

ప్రతి రోజూ మనం ఏదో ఒక కొత్త విషయాన్ని నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. లేదంటే An idle brain is the devil’s workshop అన్నట్లు తయారవుతుంది. కొత్త అభిరుచుల వల్ల మనిషి మెదడు అనుక్షణం క్రియాత్మకంగా, విశ్లేషణా సామర్థాన్ని కలిగి ఉంటుంది. ఇది కీలక సమయాల్లో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఎంతగానో సాయపడుతుంది. జీవితంలో నిరాశ నిస్పృహల నుంచి బయట పడటానికి అమూల్యమైన మార్గమేమంటే.. ఒక కొత్త విషయాన్ని ప్రతిరోజూ నేర్చుకుంటూ ఉండటమే. ఉదాహరణకు…
ఏదైనా సంగీత వాయిద్యాన్ని నేర్చుకోవడమో, ఇతర భాషను నేర్చుకోవడం లేదా ఒక కొత్త వంటను ప్రయత్నించడం, ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి హాస్యాన్ని ఎలా పండించాలని రకరకాల మొక్కల్ని పెంచడం….. ఇలా మనకు తెలియని విషయాన్ని మొదలుపెట్టడం.
ఇలా కొత్త విషయాలను నేర్చుకోవడం వల్ల మనలోని ఆనందపు ప్రమాణాలు మెరుగవుతాయి. ఈ ప్రపంచం ఎంత విశాలమైనదో తెలుస్తోంది. మనకెన్ని అవకాశాలున్నాయో అర్థమౌతుంది.
తద్వారా మనపై మనకు నమ్మకం ఏర్పడుతుందనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతిపనిలోను విజయం సాధించడానికి అవకాశాలు మెరుగవుతాయి. వనేస్సాకింగ్ అనే సైకాలజిస్ట్ చెప్పినట్లు నేర్చుకోవడమనేది సృజనాత్మకను వెలికితీస్తుందని చెప్పాడు. నిరంతరం నేర్చుకోవడం అనే ప్రక్రియ, అసలెలాంటి సంబంధమూలేని వాటి మధ్య ఒక కొత్త బంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగపడుతుంది. జీవితంలో ఏదో ఒక కోణంలోని కొత్తగా నేర్చుకున్న అంశం మరోచోట బ్రహ్మాండమైన ఆలోచనలను పుట్టిస్తుంది. నేర్చుకోవాలనే తపన, సృజనాత్మకత రెండు కళ్ళ లాంటివి.
నేర్చుకునే కొత్త విషయం మీద మన కెరియర్‌కు ఉపయోగడటమే కాక అనేక ప్రతిభావంతుల్ని మనకు పరిచయం చేసే అవకాశం ఉంది.
నేర్చుకోవడం అనే అలవాటు మనలో సృజనాత్మకతకు ఆజ్యంలా ఉపయోగపడుతుందని మనస్తత్వ శాస్త్రవేత్త వనెస్సా కింగ్ చెప్పాడు. సంబంధంలేని విషయాలకు ముడిపెట్టి ఆలోచించినా, ఒక కొత్త పద్ధతి గురించి తెలుసుకున్నా సరికొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. ఆసక్తి, సృజన కవలపిల్లల వంటివి. వీటివల్ల మనలో కొత్త అభిరుచి కలుగుతుంది. సాధన చేసే కొద్దీ అది పెరుగుతుంది. ఇందువల్ల మనలాంటి భావాలున్నవారితో పరిచయం, స్నేహం ఏర్పడతాయి.
జీవితంలో స్థిరపడటానికి : ఏమి నేర్చుకోవాలనుకుంటున్నారు? ఎలా నేర్చుకోవాలనుకుంటున్నారు? మీరు చదవడానికి ఇష్టపడతారా..ప్రాక్టికల్‌గా పనిచేస్తూ నేర్చుకోవడానికి ఇష్టపడతారా? సమాజంలో తిరుగుతూ నేర్చుకుంటారా? ఇల్లు కదలకుండా తాపీగా నేర్చుకుంటారా? కంబైండ్ స్టడీ చేస్తారా? ఒక్కరిగా చదువుకుంటారా? గురువు సమక్షంలో సందేహాలు తీర్చుకుంటూ చదువుతారా? పుస్తకాలు చదువుతూ, వీడియోలు, ఉపన్యాసాలు వింటూ నేర్చుకుంటారా? ఏది నేర్చుకోవాలన్నా టైమెంత కావాలి? అంత టైమ్ మీరు ఇవ్వగలుగుతారా? అన్నది ఆలోచించుకుని ఏం నేర్చుకోవాలో నిర్ధారించు మనుకుంటున్నారో తేల్చుకోండి.
ఏది నేర్చుకోవాలన్నా దానికంటూ ఒక టార్గెట్ టైమ్ ఫిక్స్ చేసుకోవాలి. ఆ గడువులోగా అది కంప్లీట్ అయి తీరాలి. ఇష్టమైన పని కష్టమైనా మనసుపెట్టి నేర్చుకుంటే కాస్త ఎక్కువ టైమ్ పట్టినా అంతగా శ్రమ అనిపించదు. కనుక లాంగ్ అవర్స్ వర్క్‌చేయడం అనేది అలవాటుగా మార్చుకోవాలి. విషయం బాగా అర్థం కావడానికి సోనూ విషయం తెలుసుకుందాం.
కలిసి నేర్చుకుంటే…
ఆమెకు నలుగురితో కలిసి కంబైండ్‌గా నేర్చుకోడం ఇష్టం. ఇంట్లో ఓ మూలన కూచుని కాక బయట ప్రపంచాన్ని అబ్జెర్వ్ చేస్తూ చురుకుగా ఉండాలని, ప్రతీదీ అబ్జర్వ్‌చేస్తూ నేర్చుకోవాలని ఆమె కోరిక. కానీ ఆమెకు అంత టైమ్ లేదు. ఉద్యోగం..ఇల్లూ..పిల్లలు..ఊపిరి సలపని చాకిరీ! కనుక పుస్తకాలు ముందేసుకుని చదువుతూ నేర్చుకోవాలంటే అయ్యేపనికాదు. అందుకే నలుగురితో కలిసి పనిచేయడం ద్వారా కొత్తకొత్త విషయాలు నేర్చుకోవాలనుకుంది. పనులన్నీ అయ్యాక ఖాళీగా ఉండే సమయాన్ని ఎంచుకుంది. ఆ సమయంలో బయటకు వెళ్లి తాను కోరుకున్న విషయం నేర్చుకుంది.
ఒంటరిగా నేర్చుకుంటే..
రమకు అడవి మొక్కల పెంపకం గురించి తెలుసుకోవడం ఇష్టం. దీనికి సంబంధించిన పుస్తకాలు కొన్ని చదివినా దీనికి సంబంధించిన వివరాలను నిపుణుల వద్దకు వెళ్ళి మరింతగా తెలుసుకోవడం ఇష్టం. అందుకోసం చేస్తున్న ఉద్యోగం టైమింగ్ అడ్జెస్ట్ చేసుకుని సమయం కేటాయించుకుంది. తెలుసుకున్న సమాచారాన్ని ఆర్టికల్స్‌గా రాసి పత్రికలకు పంపింది. అవి అచ్చయి పదిమంది మెచ్చుకుంటూ ఉంటే ఎంతగానో ఆనందించింది.
విషయాలు అనేకం నేర్చుకునే మార్గాలూ పుష్కలం
నేర్చుకోడానికి విషయాలు ఎన్నున్నాయో అంతకు మించిన మార్గాలు కూడా ఉన్నాయి. విషయాన్ని ఎంచుకోవడం, మార్గాలను ఎంపికచేసుకోవడం, అందుకు అవసరమైన ఎఫర్ట్ పెట్టడం మీ వంతు. ఏది నేర్చుకున్నా హైరానా పడకుండా నేర్చుకోవాలి. ఆగమాగమైపోకుండా ఉండాలి. పరిగెత్తి పాలుతాగడం కాదు. నిలబడి నీళ్ళు తాగినా మేలే అన్న మన పెద్దల మాటలను పదేపదే గుర్తుచేసుకోవాలి.
పదిమందితో పంచుకుంటే మేలు : నేర్చుకోడానికి ఒక రకమైన టాలెంట్స్ అవసరమైతే దాన్ని ఎదుటి
వారికి చెప్పడానికి మరో రకమైన స్కిల్స్‌కావాలి. మనకు తెలిసినదాన్ని మరొకరికి చెబితే మన అనుభవాలను పదిమందితో పంచుకుంటే మనకు తెలిసిన విద్య బలపడుతుంది. పదిమందికీ ఉపయోగపడుతుంది. వేణ్ణీళ్ళకు చన్నీళ్ళుగా పనికివచ్చే పనులు నేర్చుకుంటే మనకే కాదు దాన్ని నేర్చుకున్న వారికి సైతం ఉపయోగపడుతుంది. కుట్లు, అల్లికలు, బొమ్మలతయారీ, మంచి వంటకాల తయారీ, బేబీ సిట్టింగ్‌లో మెలకువలు వంటివి నేర్పిస్తే వారికి కొత్తగా ఒక విద్య తెలియడమేకాదు అంతో ఇంతో సంపాదించుకోడానికి కూడా పనికివస్తుంది.