Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

తగ్గుతున్న నాటు పొగాకు సేద్యం

Tobacco

ములకలపల్లి: మండలంలో సంవత్సరం, సంవత్సరం నాటు పొగాకు సేద్యం తగ్గిపోతుండగా రైతులు ఇతర వాణిజ్యపంటలను సేద్యం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. నాటు పొగాకు సేద్యం వలన పొగాకు వ్యాపారులపై నాటు పొగాకు సేద్యం ప్రారంభించిననాటినుండి పొగాకును వ్యాపారులు కొనుగోలు చేసేవరకు రైతులు కంటికి రెప్పలా కాపాడవలసి ఉంటుంది. సంవత్సరంపాటు నాటుపొగాకును కంటికి రెప్పలా కాపాడితే కొనుగోలు చేసే సమయంలో వ్యాపారులు ధరను నిర్ణయించకపోగా వచ్చే వ్యవసాయ సీజన్‌లో సెప్టెంబర్, అక్టోబర్ నెలలోను రైతులను ఏలూరు, హుస్నాబాద్, గన్నవరం పిలిపించి అంతర్జాతీయంగా పొగాకు మార్కెట్ లేదని, అంతర్జాతీయ మార్కెట్‌లో పొగాకు ధరలు తగ్గుముఖం పట్టాయని అందువలన రైతులు ఆశించిన ధరను ఇవ్వలేకపోతున్నామని తాపీగా చావుకబురు చల్లాగ చెప్పారు.

ఆందోళనకు గురైన రైతులు పెట్టిన పెట్టుబడి అయినా వస్తుందో రాదో అనే ఆందోళనతో వ్యాపారులు నిర్ణయించిన ధరకు పొగాకును అమ్ముకుంటున్నారు. గత అనేక సంవత్సరాలుగా వ్యాపారులు నాటుపొగాకు సేద్యం ప్రారంభం అయిననాటినుండి రైతు లకు ఎరువులు, పురుగు మందులను, కూలీలకు చెల్లించడానికి కొద్ది డబ్బులను ముం దుగా రైతులకు ఇస్తుంటారు.

పొగాకు చేతికొచ్చిన తరువాత తుట్లలో అనగా 225 కేజిల చొప్పున కాటా పెట్టి తుట్టికి రూ.8 నుండి 10వేల వరకు గతంలో చెల్లించేవారు. గత సంవత్సరం రైతులు తుట్టికి రూ.10 వేలు వస్తుందనుకుంటే పొగాకు నాణ్యతనుబట్టి వ్యా పారులు రూ.8 వేల నుండి రూ.10 వేల వరకు చెల్లించారు. దీంతో నిరాశ చెందిన రైతులు ఇతర వాణిజ్య పంటలవైపు దృష్టిని పెట్టారు. పొగాకు సేద్యం చేయాలంటే పొగాకు నారుమళ్ళు పోసి వాటిని మరల వేరే ప్రాంతంలో నాటి మొక్క పెరిగిన తరువాత వ్యవసాయ భూములలో వేసి రాత్రినక, పగలనక పొగాకునుకాపాడుకోవాలి. మూడు నెలల అనంతరం పొగాకు పిలక తీసి పొగాకు తయారి దశకు వచ్చిన అనంతరం కోసి పొగాకు కర్రలతో పందిళ్ళు వేసి వాటికి తోరణాల రూపంలో వేలాడతీస్తారు.

ఈ సమయంలో అకాల వర్షాలు వస్తే పొగాకు నాణ్యత పడిపోయి ధర 50 శాతానికి పడిపోతుంది. ఈ దశనుండి పొగాకును కాపాడుకొని మరల తాటాకుల మండె వేస్తారు. ఈ సమయంలో కూడా పొగాకు తడవకుండా చూసుకోవాలి. ఇక్కడ పొగాకు పదును వచ్చిన అనంతరం వ్యాపారులకు
కబురు చేయగా వ్యాపారులు వచ్చి కాటా పెట్టుకొని తీసుకెళ్తారు. ఈ సమయంలో వ్యాపారులకు, రైతులకు మధ్య నిర్ణయం కాదు. ఒక విధంగా చెప్పాలంటే పంట పండించడంవరకే కాని ధర నిర్ణయించే అధికారం వ్యాపారులకే ఉంటుంది. ఈ విషయంలో రైతుకు ఇష్టమున్నా లేకున్నా వ్యాపారులు నిర్ణయించిన ధరకు ఒప్పుకోవలసిందే.

ఈ విషయాలతో విసిగిపోయిన రైతులు గత సంవత్సరం 50 శాతం మంది పొగాకు పంటను తీసివేసి జామాయిల్ సేద్యాన్ని ప్రారంభించారు. ఈ సంవత్సరం నూటికి పది శాతం మంది మాత్రమే పొగాకును సేద్యం చేయగా మిగిలిన వారు మొక్కజొన్న, పుచ్చ, శెనగ ఇతర వాణిజ్యపంటలను సేద్యం చేయడం జరిగింది. గత అనే సంవత్సరాలకంటే ఈ సంవత్సరం పొగాకు సేద్యం తగ్గడం చూస్తుంటే ఈ సంవత్సరం ధర రైతులు ఆశించన కంటే ఎక్కువ ఉంటే వచ్చే సంవత్సరం పొగాకు సేద్యం పెరుగుతుంది. లేకుంటే పొగాకు సేద్యం అనేది ఒకనాటి కళగానే మిగిలిపోయే పరిస్థితులున్నాయని రైతులు పేర్కొంటున్నారు. రైతుల కష్టాల కన్నీళ్ళను దృష్టిలో ఉంచుకొని పొగాకు పంట సేద్యం అంతరించిపోకుండా ఉండాలంటే రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వడానికి వ్యాపారులు సిద్ధపడాలని రైతులు కోరుతున్నారు.

Comments

comments