Search
Wednesday 21 November 2018
  • :
  • :

నేడు జెఇఇ మెయిన్

jee

మన తెలంగాణ/ హైదరాబాద్ : దేశవ్యాప్తం గా ఎన్‌ఐటి, ఐఐటిల్లో ప్రవేశాలకు నిర్వహిం చే జెఇఇ మెయిన్ రాత పరీక్షను ఆదివారం నిర్వహించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఇ) ఏర్పాట్లు చేసిం ది. బిఇ, బి.టెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం పేపర్ 1 పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుండగా, బిఆర్క్, బిప్లానింగ్ లో ప్రవేశాల కోసం పేపర్2 పరీక్ష మధ్యా హ్నం 2 గంటల నుంచి జరుగుతుంది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా సుమారు 13 లక్షల మంది విద్యార్థులు హాజరుకానుండగా, తెలంగాణ నుంచి 74,580 మంది పరీక్ష రాయనున్నారు. వీరి కోసం హైదరాబాద్, వరంగల్, ఖమ్మంలో 116 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇదే పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో ఏప్రిల్ 15,16 తేదీలలో జరుగనున్నా యి. ఆన్‌లైన్ పరీక్షలకు మరో 15 వేల మం ది విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉంది. పెన్నులూ పరీక్షా హాల్లోనే : జెఇఇ మెయిన్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్  పరికరాలు వెంట తెచ్చుకోవద్దని సిబిఎస్‌ఇ స్పష్టం చేసింది. పరీక్ష రాసేందుకు అవసరమైన బాల్ పాయింట్ పెన్నులను కూడా పరీక్షాహాల్లోనే అందజేస్తామని తెలిపింది. విద్యార్థులు తమ హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా ఒరిజినల్ గుర్తింపుకార్డు వెంట తెచ్చుకోవాలని స్పష్టం చేసింది. ఉదయం 9.30 గంటలకు జరిగే పరీక్షకు ఉదయం 7 గంటల నుంచి, మధ్యాహ్నం 2కు ప్రారంభమయ్యే పరీక్షకు, మధ్యాహ్నం 12.45 గంటల నుంచే పరీక్షా హాల్లోకి అనుమతిస్తామని పేర్కొంది. పరీక్ష ప్రారంభ సమయం తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టంచేసింది.
తినుబండారాలను లోపలికి అనుమతించరు
తినుబండారాలు, టీ, కాఫీ,కూల్ డ్రింక్స్ వంటివి పరీక్షా హాలులోకి అనుమతించరు. మధుమేహ వ్యాధి ఉన్న విద్యార్థులు మాత్రం షుగర్ ట్లాబ్లెట్లు, అరటి పండ్లు, యాపిల్, ఆరెంజ్ వంటి పండ్లను వెంట తీసుకెళ్లవచ్చు. ట్రాన్స్‌పరెంట్ వాటర్ బాటిల్‌ను మాత్రమే లోపలికి అనుతిస్తారు. కానీ చాక్లెట్లు, క్యాండీ, సాండ్ విచ్ వంటి ప్యాక్డ్ ఫుడ్స్‌ను లోపలికి అనుమతించరు.

Comments

comments