Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

నేడు ‘జిఎస్‌టి దినోత్సవం’

gst

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జిఎస్‌టి)  తొలి సంవత్సరం ప్రపంచానికో  ఉదాహరణ అని, భారతీయ పన్ను అపూర్వ సంస్కరణలో పన్ను చెల్లింపుదారులు సంసిద్ధతను కనబరిచారని ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. కొత్త పరోక్ష పన్ను విధానం తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2018 జూలై1న ప్రభుత్వం ‘జిఎస్‌టి దినం’ జరుపుకోనుంది. భారత్‌లో జిఎస్‌టిని గత ఏడాది జూన్ 30, జులై 1 మధ్యరాత్రి అమలులోకి తెచ్చారు. నాడు పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో దీనికి సంబంధించిన తంతు కొనసాగింది. జిఎస్‌టి దినోత్సవం కార్యక్రమానికి కేంద్ర రైల్వే, బొగ్గు, ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి పియూష్ గోయల్ ముఖ్యఅతిథిగా అధ్యక్షత వహించనున్నారు. కాగా ఆర్థిక సహాయ మంత్రి శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా గౌరవ అతిథిగా పాల్గొననున్నారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది. ‘ఒకే పన్ను, ఒకే దేశం’ అనే నినాదం కింద దేశానికంతటికీ ఒకే ఆర్థిక విధానం ఉండేలా భారత్‌లోని అనేక స్థానిక పన్నులను జిఎస్‌టిలో కలిపేశారు. ఇవే బిల్లు అమలనేది ‘శాఖాపరమైన పోలీసు విధానం’ నుంచి ‘స్వీయ ప్రకటన విధానం’కు స్మరణీయ మార్పును తీసుకొచ్చిందని, ఇవే బిల్లుల ద్వారా దేశవాప్తంగా వస్తు రవాణా ఎలాంటి అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా జరిగే అవకాశం ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. రూ. 50,000కు మించిన వస్తువులను రావాణా చేయడానికి ఇవే బిల్లులను తీసుకోవాలని, కోరినప్పుడు జిఎస్‌టి ఇన్‌స్పెక్టర్‌కు వాటిని చూపాలని పేర్కొంది. కాగా అంతర్రాష్ట్ర ఇవే బిల్లు విధానాన్ని ఏప్రిల్ 1న ప్రవేశపెట్టారు. కాగా రాష్ట్రంలోపల  రావాణాకు అవసరమైన ఇవే బిల్లును ఏప్రిల్ 15 నుంచి దశలవారీగా అమలుపరిచారు.

Comments

comments