Home తాజా వార్తలు ‘బేర్’మంటున్న మార్కెట్లు

‘బేర్’మంటున్న మార్కెట్లు

Losses in domestic markets
భారీగా నష్టపోయిన సూచీలు

ముంబై: దేశీయ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగుతోంది. అంతర్జాతీయ, దేశీయ అంశాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఆటోమొబైల్, ఫార్మా, ఐటి, ఆర్థిక రంగాల షేర్లు నష్టపోగా, విదేశీ సంస్థాగత మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. దీంతో వరుసగా ఎనిమిదో రోజు సూచీల పతనమయ్యాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు పతనమవగా, నిఫ్టీ 10,700 మార్క్‌ను కోల్పోయింది. ఉదయం నుంచే సూచీలు పతనం వైపు దారితీశాయి. ఆ తర్వాత కోలుకునే అవకాశమే లేకుండా పోయింది. మార్కెట్ ముగిసే సమయానికి నష్టాలు మరింతగా పెరిగాయి. ఆరంభ ట్రేడింగ్‌లో 190 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత డౌన్ అయింది. అమ్మకాల ఒత్తిడితో ఏ దశలోనూ కోలుకోలేని సెన్సెక్స్ చివరకు 310 పాయింట్ల నష్టంతో 35,498 వద్ద ట్రేడింగ్‌ను ముగించింది.

అటు నిఫ్టీ 83 పాయింట్లు కోల్పోయి 10,641 వద్ద స్థిరపడింది. ప్రధానంగా భారతీ ఇన్‌ఫ్రాటెల్, ఒఎన్‌జిసి, జి ఎంటర్‌టైన్‌మెంట్స్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. ఇండియాబుల్స్ హౌసింగ్, టిసిఎస్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్షియల్, యస్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. బిఎస్‌ఇ మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1,676 నష్టపోగా, 878 షేర్లు మాత్రమే లాభాలతో ముగిశాయి. నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐలు) రూ. 966 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దేశీ ఫండ్స్(డిఐఐలు) రూ. 853 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేశాయి.

Today is Losses in domestic markets