Home ఆఫ్ బీట్ నేడు నానే బియ్యం బతుకమ్మ

నేడు నానే బియ్యం బతుకమ్మ

Today is Nana Biyyam Bathukamma festival Celebrations

ప్రకృతిని దేవతగా పూజించే పూల పండుగ బతుకమ్మ. బతుకు తెరువును మెరుగు పరిచే అమ్మ కనుక బతుకమ్మ అని పిలిచారు. ప్రకృతి నుంచి సేకరించిన పూలను తిరిగి ప్రకృతికే సమర్పించడం బతుకమ్మ పండుగ విశిష్టత. రకరకాల పూలతో బతుకమ్మను చేసి, పూజించి తెలంగాణ ఆడపడుచులు ఆనందోత్సాహాలతో సంప్రదాయాన్ని, వేడుకగా జరుపుకుంటారు.

నాలుగ వ రోజు
నాన బెట్టిన బియ్యం 1 కప్పు, బెల్లం 1 కప్పు
పాలు 1కప్పు, యాలకులు 2
నీళ్లు 1 కప్పు, డ్రైఫ్రూట్స్ ఒక కప్పు.
తయారీ విధానం …. నాన బెట్టి న బియ్యాన్ని ఆర బెట్టి పెట్టుకోవాలి. దానిని సన్నగా పిండి చేసుకోవాలి. తరువాత ఒక పాత్రలో నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్ వేయాలి వేగాక , పాలు ఒక కప్పు నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. తరువాత అందులో బియ్యం పిండిని వేసి సన్నని సెగ పై అలా తిప్పుతూ ఉండాలి. తరువాత బెల్లం వేసి కలపాలి (తురిమినది). తరువాత యాలకులు పొడి వేసి కలపాలి. తరువాత బతుకమ్మ కు నైవేద్యంగా సమర్పించాలి.

బతుకమ్మ పాట

చిత్తు చిత్తుల బొమ్మ
చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన

రాగి బిందె తీసుక రమణి నీళ్లకు పోతే
రాములోరు ఎదురాయెనమ్మో ఈ వాడలోన

వెండి బిందె తీసుక వెలది నీళ్లకు పోతే
వెంకటేశుడు ఎదురాయెనమ్మో ఈ వాడలోన

బంగారు బిందె తీసుక భామ నీళ్ళకు పోతే
భగవంతుడు ఎదురాయెనమ్మో ఈ వాడలోన

పసిడి బిందె తీసుకు పడతి నీళ్ళకు పోతే
పరమేశుడు ఎదురాయెనమ్మో ఈ వాడలోన

ముత్యాల బిందె తీసుక ముదిత నీళ్ళకు పోతే
ముద్దుకృష్ణుడు ఎదురాయెనమ్మో ఈ వాడలోన
చిత్తు చిత్తుల బొమ్మ బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన…

Today is Nana Biyyam Bathukamma festival Celebrations