Home రాష్ట్ర వార్తలు నేడు సిపిఐ 90వ వార్షికోత్సవాలు

నేడు సిపిఐ 90వ వార్షికోత్సవాలు

 

666666666హైదరాబాద్ వేడుకలలో పాల్గొననున్న సురవరం, ఉదయం 10 గంటలకు  మఖ్దూం భవన్‌లో అరుణ  పతాకావిష్కరణ, మధ్యాహ్నం   3 గంటలకు షాలిమార్ ఫంక్షన్‌హాల్
వరకు ప్రదర్శన, సభ

 హైదరాబాద్ : దేశ్యాప్తంగా శని వారం భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) 90 వార్షి కోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరి గాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా వ్యవస్థాపక దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకునేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తమ య్యాయి. సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూంభవ న్‌లో శనివారం ఉదయం 10 గంటలకు సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అరుణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 3 గంట లకు మఖ్ధూంభవన్ నుంచి నారాయణగూడలోని షాలీమార్ ఫంక్షన్ హాల్ వరకు ప్రదర్శన జరుగు తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం షాలీమార్ ఫంక్షన్ హాల్‌లో జరిగే 90వ వార్షికోత్సవ సభలో ముఖ్యఅతిధిగా సురవరం సుధాకర్‌రెడ్డి పాల్గొని సందేశమిస్తారనితెలిపారు. సంవత్సరం లో పార్టీ నిర్మాణంపై మరింత దృష్టి కేంద్రీకరించి భూమి, భుక్తి, సామాజిక న్యాయం కోసం పార్టీ పునరంకితమవుతుందని తెలిపారు. సిపిఐ 90వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని శని వారం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు అరుణ పతాకావిష్కరణలు, సభలు సమావేశాలు నిర్వ హించడం ద్వారా జయప్రదం చేయాలని చాడ వెంకట్‌రెడ్డి ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.