Home తాజా వార్తలు గెలుపు కోసం భారత్..

గెలుపు కోసం భారత్..

vrt

 ఆత్మవిశ్వాసంతో ఇంగ్లాండ్

 నేడు రెండో టి-20

కార్డిఫ్(ఇంగ్లాండ్): మాంచెస్టర్‌లో జరిగిన తొలి అంతర్జాతీయ టి20ని టీమిండియా గెలిచి తన ఆధిక్యతను చాటుకుంది. ఈ విజయోత్సాహాన్ని మున్ముందు కొనసాగిస్తుందన్న ధోరణిని కూడా కనబరుస్తోంది. కాగా ఇంగ్లాండ్ మాత్రం నుంచి ఓటమి నుంచి పుంజుకోవాలనుకుంటోంది. ఇక రెండో అంతర్జాతీయ టి20 మ్యాచ్ శుక్రవారం స్థానిక కాలమాన ప్రకారం 5.30గంటలకు ఇంగ్లాండ్‌లోని కార్డిఫ్‌లో ఉన్న కార్డిఫ్ వేల్స్ స్టేడియంలో జరుగనుంది.
భారత్, ఇంగ్లాండ్ క్రికెట్ జట్లు రెండూ సమ ఉజ్జీలుగా ఉన్నందున పోటీ తక్కువగా ఉండబోదు. రెండు జట్లలో కావలసినంత సత్తా ఉంది. అయితే తొలి అంతర్జాతీయ టి20మ్యాచ్‌లో ఆతిధేయ జట్టు ఇంగ్లాండ్‌పై భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందినందున టీమిండియానే మెరుగ్గా కనబడుతోంది. విరాట్ కోహ్లి సేన తన ఇంగ్లాండ్ పర్యటనలో ఏమాత్రం చెమటోడ్చకుండానే గెలుపొందడం విశేషం. సొంతగడ్డపై ఆడిన ఇంగ్లాండ్ జట్టు మాచ్‌లోని మొదటి ఐదు ఓవర్లలో బాగానే ఆడింది. కానీ వారి స్కోరు 50 చేరాక ఆట భారత్ వైపు మళ్లింది. టీమిండియా అన్ని విధాల ఇంగ్లాండ్ జట్టుకన్నా మెరుగ్గా ఆడింది. కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్టు పడగొట్టి ప్రశంసలు అందుకున్నారు. కాగా కెఎల్ రాహుల్ తన రెండో అంతర్జాతీయ టి20లో శతకాన్ని చేశాడు. అతడు 3 నంబర్‌లో తన పాత్రను బాగానే పోషించాడు. అతడు చేసిన శతకం జంకుగొంకు లేకుండా అతడు షాట్లు కొట్టే సత్తాను చాటింది. భువనేశ్వర్‌కుమార్ కొంత మేరకు మెరుగ్గానే ఆడాడు. కాగా ఇతర పేసర్లయిన ఉమేశ్ యాదవ్, హార్దిక్ పాండ్య ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో 22 డాట్ బాల్స్ వేశారు. ఏ రీతిగా చూసినప్పటికీ టీమిండియాకు రెండో టి20లో కూడా విజయావకాశాలు మెండుగా ఉండనున్నాయనిపిస్తోంది.
మరోవైపు ఇంగ్లాండ్ జట్టు టి20 ఫార్మాట్‌లో పుంజుకుని ఆడాలని చూస్తోంది. అందుకు వారి జట్టులో జాసన్ రాయ్, జోస్ బట్లర్, జానీ బేర్టోవ్, అలెక్స్ హేల్స్, జోస్ బట్లర్, ఇయాన్ మోర్గాన్ భారత స్పిన్నర్ల శక్తియుక్తులు ఆకలింపు చేసుకుని అందుకు తగ్గట్టుగా రాణించే అవకాశం ఉంది. తొలి మ్యాచ్‌లో బట్లర్ మరో అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. కుల్దీప్ ఛాలెంజ్ గురించి మాట్లాడుతూ ‘ అతడు మంచి బౌలర్. కాగా అతడి బౌలింగ్‌ను అర్థం చేసుకుని ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఆడాల్సి ఉంది. ఈ కోణంలో వారు అలవాటుపడాలి’ అని బట్లర్ అన్నాడు. కాగా ఇంగ్లాండ్ స్పిన్నర్లు మరింత ఒత్తిడికి లోనవుతున్నారు. ఆదిల్ రషీద్ బాగానే ఆడాడు. మోయిన్ అలీ చాలా పరుగులు ఇచ్చుకున్నాడు. కానీ అతడు వేసవి సీజన్‌లో రాణించినట్లు తక్కువ పరుగులు ఇచ్చేలా మళ్లీ పుంజుకోగలడని ఆశిస్తున్నారు. మోర్గాన్ సేన వేసవిలో కొత్త ప్రమాణాలు నెలకొల్పినట్లు మళ్లీ ఈ సీరిస్‌లో కూడా రాణిస్తారేమోననిపిస్తోంది.
కీలకం కానున్న క్రికెటర్లు
రెండో అంతర్జాతీయ టి20లో కీలకం కానున్న క్రికెటర్లు ఆదిల్ రషీద్(ఇంగ్లాండ్), విరాట్ కోహ్లి(భారత్). ఆదిల్ రషీద్ ఇంగ్లాండ్ లెగ్‌స్పిన్నర్. తొలి మ్యాచ్‌లో చాలా తక్కువ పరుగులు ఇచ్చాడు. అతడు తొలి టి20లో 25 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. కానీ ఆస్ట్రేలియాతో ఇంగ్లాండ్ ఆడిన సిరీస్‌లో చాలా బాగా రాణించాడు. అతడు తక్కువ పరుగులిచ్చి ఎక్కువ వికెట్లు పడగొట్టగలడు. కాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి 4వ స్థానంలో కొత్త పద్ధతిలో ఆడనున్నాడు. తాను నాలుగో స్థానంలో రావడం వల్ల ఆటపై మరింత నియంత్రణకు అవకాశం ఉంటుందని, పైగా యువ క్రీడాకారులకు స్వేచ్ఛగా ఆడే వీలుకలుగుతుందని అభిప్రాయపడుతున్నాడు. ఐర్లాండ్‌తో ఆడిని మ్యాచ్‌లలో చాలా మెల్లగా ఆడిన విరాట్ కోహ్లి ఇకపై పరుగుల వర్షం కురిపించవచ్చని అనిపిస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ టి20లో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన రికార్డును విరాట్ కోహ్లి నమోదు చేశాడు.
వాతావరణ పరిస్థితులు
మాంచెస్టర్‌లో మాదిరిగానే కార్డిఫ్‌లో కూడా ఇంగ్లాండ్ జట్టుకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వనున్నారని తెలుస్తోంది. కార్డిఫ్‌లో వాతావరణం ఎండగా ఉండనున్నది. ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. కార్డిఫ్‌లో గత నెల ఆస్ట్రేలియాతో ఆడిన వన్డేలో ఇంగ్లాండ్ జట్టు 342 స్కోరు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.