Home జాతీయ వార్తలు మరాఠా ఆందోళన ఉద్రిక్తం

మరాఠా ఆందోళన ఉద్రిక్తం

mumbai

రాళ్లు రువ్విన ఘటనలో పోలీసు మృతి
నేడు ముంబయి బంద్‌కు ఆందోళనకారుల పిలుపు

ముంబయి: మహారాష్ట్రలో రిజర్వేషన్ల కోసం మరాఠా సామాజిక వర్గం చేపట్టిన ఆందోళన  హింసాత్మకంగా మారింది. రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న సంఘాల పిలుపు మేరకు మంగళవారం  రాష్ట్ర వ్యాప్త బంద్ సందర్భంగా రాళ్లు రువ్విన ఘటనలో ఒక పోలీసు కానిస్టేబుల్ మృతిచెందగా,  మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న మరాఠాక్రాంతి మోర్చా బుధవారం ముంబయి బంద్‌కు పిలుపునిచ్చింది. రిజర్వేషన్లకు అనుకూలంగా సోమవారం  జరిగిన నిరసన ర్యాలీ సందర్భంగా ఒక కార్యకర్త చనిపోయినందుకు నిరసనగా ఆ సంస్థ మంగళవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఔరంగాబాద్‌లో కాకాసాహెబ్ షిండే అనే 27 ఏళ్ల యువకుడు గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు, మంగళవారంకూడా ఔరంగాబాద్‌కు చెందిన జగన్నాథ్ సోనావానే అనే మరో యువకుడు కూడా ఇలాగే గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. అయితే నీళ్లు లేని నది ఒడ్డుపై పడడంతో తీవ్రగాయాల పాలయిన అతడ్ని ఆస్పత్రిలో చేర్చారు. ఇదిలా ఉండగా షిండే స్వగామ్రం కేగావ్‌లో మంగళవారం జరిగిన అతని అంత్యక్రియలకు హాజరయిన శివసేన ఎంపి చంద్రకాంత్ ఖైరే ప్రజాగ్రహాన్ని చవి చూడాల్సి వచ్చింది. అక్కడ ఉన్న జనం ఎంపిపై దాడి చేసి కొట్టడానికి అత్నించడంతో ఆయన వెనుదిరగాల్సి వచ్చింది. ఎంపి కారుపై జనం రాళ్లు కూడా రువ్వారని పోలీసులు చెప్పారు. షిండే మృతితో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తాజాగా హింస చెలరేగింది. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ఔరంగాబాద్ జిల్లాలోని గ్రామీణ ప్రాం తాల్లో  ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేశారు. కేగావ్‌లో విధి నిర్వహణలో ఉన్న పోలీసు కానిస్ట్టేబుల్ శామ్ అట్గోంకర్  రాళ్లు రువ్వడంతో త లెత్తిన గందరగోళంలో చిక్కుకుని చనిపోయాడని పోలీసులు తెలిపారు. అ యితే అతని మృతికి కారణాలు ఇంకా నిర్ధారణ కాలేదని వారు తెలిపారు. రా ళ్లు రువ్విన ఘటనలో మరో కానిస్టేబుల్ కూడా గాయపడ్డారు. ఆందోళనకారులు ఒక అగ్నిమాపక శకటానికి కూడా నిప్పు పెట్టారు. కాగా ముఖ్యమంత్రి మరాఠాలకు క్షమాపణ చెప్పేవరకు తాము తమ ఆందోళనను కొనసాగిస్తామ ని మోర్చా కోఆర్డినేటర్ రవీంద్ర పాటిల్ చెప్పారు. అవసరమైతే ముంబయిలో ను తాము ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. కాగా ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ఆదివారం పోలాపూర్ జిల్లాలో పర్యటించాల్సి నండగా మరాఠా ఆంందోళనకారులు తన కార్యక్రమాన్ని భగ్నం చేస్తారన్న కారణం గా ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. దీనిపై సిఎం క్షమాపణ చె ప్పాలంటే మరాఠాలు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. కాగా మంగళవారం బంద్ ప్రభావం పశ్చిమ మహారాష్ట్రతో పాటుగా ఔరంగాబాద్, బీడ్, అహ్మద్‌నగర్ జిల్లాల్లో ఎక్కువగా ఉంది. రాష్ట్ర జనాభాలో 30 శాతం మే రకుండే మరాఠాలకు రిజర్వేషన్ల అంశంప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది.