Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

నేడు తేలనున్న పంచాయతీ భవితవ్యం

Today result panchayat futures

రిజర్వేషన్లపై మల్ల గుల్లాలుష                                                                                                                                      కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంట                                                                                                                                ఆశావాహుల్లో ఆందోళన

మనతెలంగాణ / పెద్దపల్లి : రాష్ట్ర హైకోర్టు నేడు వెలు వరించనున్న ఉత్తర్వుపై పంచాయతీ ఎన్నికల భవితవ్యం ఆధారపడి ఉండడంతో సర్వత్రా ఉత్కంట నెలకొని ఉంది. పంచాయతీ ఎన్నికలను జులై మాసంలో మూ డువిడతలుగా నిర్వహిస్తామని ప్రకటించిన ప్రభు త్వం అందుకు తగ్గ కసరత్తు చేస్తున్న క్రమంలో రిజ ర్వేషన్ల ప్రక్రియను తప్పు పడుతూ కొందరు కోర్టు మెట్లెక్కడంతో గందరగోళం నెలకొంది. కొత్త పంచాయితి రాజ్ చట్టంలో తెలంగాణ ప్రభుత్వం పేర్కొన్న విదంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల పై అనుమానాలు నెలకొన్నాయి. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని గతంలో సుప్రిం కోర్టు తీర్పు వెలువరించింది. సుప్రిం తీ ర్పుననుసరించి రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ తదితర రిజ ర్వేషన్లు పోను 29 శాతానికి మించి బీసీలకు రిజర్వేషన్లు సాద్యం కాకపోవచ్చు. సుప్రింకోర్టు తీర్పు తరువాత రూ పొందించిన పంచాయితి రాజ్ చట్టం ప్రకారం సుప్రిం తీర్పును ఖచ్చితంగా అమలు చేయాలని పట్టుపట్టే అవ కాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపద్యంలో రాష్ట్ర హైకోర్టు రిజర్వేషన్ల ప్రక్రియ పై ఈ నెల 25 న కౌంటర్ దాఖలు చేయాలని విదించిన గడవు నేటితో ముగియనున్న నేపద్యంలో ప్రభుత్వం తీరు ఎలా ఉండబోతోందని ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా రూపొందించిన పంచాయితి రాజ్ చట్టంలో రిజర్వేషన్ల విదానానికి ఒటర్ల సంఖ్య,జనాభా ప్రాతిపదికిన ఖరారు చేస్తున్న నేపద్యంలో బీసీల రిజర్వేషన్లు 27 శాతానికి మించి ఉండబోవని కౌంటరు దాఖలు చేస్తె కోర్టు అభ్యంతరం చెప్పదనే నమ్మకంతో ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం దాఖలు చేసే కౌంటరు పై సంతృప్తి చెందితె ఎన్నికలు యదావిదిగా జరిగే అవకాశం ఉంది.

ఆశావాహుల్లో ఆందోళన.
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు నేడు వెలువరించనున్న ఉత్తర్వులపై ఆశావాహుల్లో ఆందోళన నెలకొంది. కోర్టుతీర్పు ఎలా ఉండబోతోంది,తమకు అనుకూలంగా వస్తుందా, రాదా అనే మీమాంశలో కొట్టుమిట్టాడుతున్నారు. పెద్దపల్లి జిల్లాలోని 14 మండలాలలో పూర్వం 200 గ్రామపంచాయితీలు ఉండగా,కొత్తగా 65 గ్రామాలను పంచాయతీలుగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మొత్తం 265 గ్రామ పంచాయతీలు ఎర్పడ్డాయి. గతంలో బీసి,ఎస్టీ,ఎస్సీ తదితర రిజర్వేషన్ల ప్రక్రిను చవిచూసిన గ్రామ పంచాతీలు ప్రస్తుత రిజర్వేషన్ల ప్రక్రియలో వాటిని పరిగణంలోకి తీసుకోబోరన్న సమాచారంతో గ్రామాలలో కొంత నైరాశ్యం ఎర్పడింది. మా గ్రామ పంచాయితికి ఇ ప్పటి వరకు ఈ ఈ రిజర్వేషన్లు పూర్తయినందున రాబోయేది మాకు అనుకూలంగా ఉంటుందనే నమ ్మకంతో పలువురు గ్రామాలలో ఎన్నికల ఎర్పాట్లలో త లమునకలై ఉన్నారు. గత నెల,రెండు నెలల నుండి తమ,తమ సామాజిక వర్గాలను సమాయత్తం చేసుకోని, ప్రజలకు అందుబాటులో ఉంటున్న వారి ఆశలపై కొత్త చట్టం నీళ్లు చల్లడంతో అసంతృప్తి నెలకొంది. నేడు కోర్టు వెలువరించే ఉత్తర్వుతో ఈ గందర గోళానికి తెరపడనుండడంతో అందరూ అతృతతో ఎదురు చూస్తున్నారు.

Comments

comments