Home పెద్దపల్లి నేడు మేడారం నీరు విడుదల

నేడు మేడారం నీరు విడుదల

dam

*హాజరుకానున్న చీఫ్‌విప్ ఈశ్వర్
*హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

మన తెలంగాణ/ధర్మారం : మేడారం రిజర్వాయర్ నుండి నీరు నేడు విడుదల చేయాలని అధికార యంత్రంగం నిర్ణయం తీసుకున్నారు. మేడారం రిజర్వాయర్ ప్రధాన గేటు వద్ద నేడు ఉదయం ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ నీటిని విడుదల చేయనున్నారు. ధర్మారం మండలంలోని గోపాల్‌రావుపేట్, సాయంపేట్, వె ల్గటూర్ మండలం పైడిపల్లి,  గోడిశెల్‌పేట్, పాతగూడూర్, సూరరం, పాలకుర్తి మండలం శానబండ గ్రామాల్లోని సాగు, త్రాగు నీటి కష్టాలు తీరుతుండగా, మేడారం మంచినీటి నుండి సమస్య పూర్తిగా తీరుతుంది. ఇప్పటికే ఎల్లంపల్లి రిజర్వాయర్ నుండి మేడారం రిజర్వాయర్ నింపిన అధికారులు చీఫ్ విప్ ప్రత్యేక చొరవతో నీటి విడుదలకు మార్గం సుగుమమైంది. ఎండిపోతున్న పంటల్ని కాపాడడంతో పాటు పశువుల దాహర్తి,  చెరువులు, కుంటలు నింపేందుకు ఏర్పాట్లు చేశారు. నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ డిఇఇ నర్సింగరావు, ఎఇఇ పర్శరాంగౌడ్‌లు నీటి విడుదల ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.