Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

నేడే ట్రంప్, పుతిన్ తొలి కీలక సమావేశం

trump-putin

హెల్‌సిన్‌కి : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ సోమవారం రష్యాలో తొలిసారి సమావేశం కానున్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు చర్చిస్తారని, అమెరికా తమ సంప్రదింపుల భాగస్వామి అని క్రెమ్లిన్ ప్రకటించింది. ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చాలా దారుణంగా ఉన్నాయని, ఇరుదేశాలు కలిసి చర్చించి ఈ సంబంధాలను మెరుగు పరుచుకోవాల్సిన అవసరముందని క్రెమ్లిన్ సలహాదారు యూరి ఉషకోవ్ చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఇరు దేశాల నేతల మధ్య చర్చలు ఏ విధంగా సాగుతాయన్నదానిపై ప్రపంచదేశాల్లో ఉత్కంఠత నెలకొంది. రెండు అగ్ర రాజ్యాల మధ్య జరుగనున్న చర్చలు నాటోపై ఎంత వరకు ప్రభావం చూపుతాయని బ్రిటన్ ఆందోళన పడుతోంది. నాటో పట్ల ట్రంప్ సీరియస్‌గా వ్యవహరించడం లేదని, దాని నుంచి అమెరికా బయటకు వస్తుందని ఇంతకు ముందే ట్రంప్ హెచ్చరించారు. పాశ్చత్య దేశాల కూటమిని ట్రంప్ నిర్లక్షం చేస్తున్నారని, ఈ దేశాల భద్రతకు ట్రంప్ తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని బ్రిటన్ భావిస్తోంది. బ్రిటన్‌తో బద్ధ శత్రువుగా వ్యవహరిస్తున్న రష్యా నాటో కూటమికి ముప్పుగా మారిందని బ్రిటన్ ఆందోళన వ్యక్తం చేసింది

Comments

comments