Home తాజా వార్తలు నేడు కెసిఆర్‌తో జగన్ భేటీ…

నేడు కెసిఆర్‌తో జగన్ భేటీ…

KCR

 

ప్రమాణ స్వీకారానికి ప్రత్యేకంగా ఆహ్వానించనున్న వైఎస్‌ఆర్‌సిపి అధినేత

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అపూర్వ విజయం సాధించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు ఫోన్ చేసి తన ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగన్‌మోహన్ రెడ్డి సిఎం కెచంద్రశేఖర్‌రావుతో కొద్దిసేపు రాష్ట్ర, దేశరాజకీయాలపై ఫోన్‌లో మాట్లాడారు. జగన్‌కు సిఎం కెసిఆర్ ఫోన్‌లో శుభాకాంక్షలు తెలుపుతూ ప్రమాణ స్వీకారోత్సవానికి వస్తున్నట్లు హామీ ఇచ్చారు. సిఎం కెసిఆర్‌తో సమామావేశం కాను న్న జగన్ రాష్ట్ర సిఎం కెసిఆర్‌తో వైఎస్‌ఆర్ సిపి అధినేత జగన్ శనివారం ప్రగతి భవన్‌లో భేటీ కానున్నారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేముందు పాలనాపరమైన విధివిధానాలు, ప్రజాసంక్షేమ పథకాలపై సుధీర్ఘంగా ఈ సమావేశంలో జగన్ సిఎం కెసిఆర్‌తో చర్చించనున్నట్లు తెలిసింది. మొదటి నుంచి వైఎస్‌ఆర్ సిపి, టిఆర్‌ఎస్‌ల మధ్య బలమైన స్నేహసంబంధాలున్నాయి. ఎన్నికల ముందు ప్రత్యేకంగా టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ జగన్‌మెహన్ రెడ్డి నివాసంలో ఆయనతో సుమారు రెండు గంటల పాటు సమావేశమయ్యారు. ఆనంతరం జగన్ కెసిఆర్‌ను కలవనున్నట్లు ప్రకటించారు. అయితే ఎన్నికల విజయం అనంతరం సిఎం కెసిఆర్‌తో జగన్ జరిపే సమావేశం అత్యంత కీలకంగా మారనుంది.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సిఎం చంద్రబాబు సృష్టించిన విభేదాలు సమసి రాష్ట్రాల మధ్య స్నేహపూరిత వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. జగన్ విజయం సాధించగానే సిఎం కెసిఆర్ తనట్వీట్‌లో జగన్‌ను అభినందిస్తూ తెలుగురాష్ట్రాల మధ్య స్నేహపూరిత వాతవరణం నెలకొంటుందని ఆశించారు. ఈ నేపథ్యంలో జగన్‌తో జరగనున్న సమావేశంలో అంతరంగికంగా పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలిసింది. అయితే జగన్ ఫోన్ ద్వారా ఆహ్వానించినప్పటికీ స్వయంగా కెసిఆర్‌ను కలుసుకుని ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించనున్నారు. ఆంధ్రలో శనివారం ఉదయం 10.30 నిమిషాలకు శాసనసభాపక్షసమావేశం, 11.30 నిమిశాలకు పార్లమెంట్ పక్ష సమావేశం నిర్వహించి ఆనంతరం ప్రభుత్వం ఏర్పాటుకోసం గవర్నర్ నరసింహన్‌ను జగన్ కలవనున్నారు. ఆతర్వాత నేరుగా విజయవాడనుంచి ప్రగతిభవన్‌కు చేరుకుని సిఎం కెసిఆర్‌తో జగన్ మోహన్‌రెడ్డి సమావేశం కానున్నారు.

Today’s Jagan meeting with KCR