Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

విభిన్న ఫీచర్లతో…. నయా ట్యాబ్స్

Tab_manatelanganaప్రస్తుతం సెల్‌ఫోన్, ట్యాబ్‌ల హవా నడుస్తోంది. సెల్‌ఫోన్ తరువాత అత్యధికంగా వినియోగిస్తున్నది ట్యాబ్స్‌నే. ప్రస్తుతం మార్కెట్‌లో వివిధ రకాల ట్యాబ్లెట్స్ లభిస్తున్నాయి. వినూత్న ఫీచర్లతో వినియోగదారులను ఇట్టే ఆకర్షిస్తున్నాయి. కంప్యూటర్‌లో చేయాల్సిన పనులన్నింటినీ ట్యాబ్‌తో చేయవచ్చు. స్క్రీన్ సైజు కూడా పెద్దగా ఉంటుంది. కాబట్టి చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ప్రాసెసర్, స్టోరేజీ విషయంలో ఎక్కువ రేంజ్ ట్యాబ్స్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేసే ట్యాబ్స్‌కు మార్కెట్‌లో మంచి ఆదరణ ఉంది. ఎక్కువ సేపు బ్యాటరీ చార్జింగ్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ సమయం ట్యాబ్‌పై ఎటువంటి ఆటంకం లేకుండా పనిచేసుకోవచ్చు. కంప్యూటర్ ఉంటే టేబుల్, చైర్ ఉండాలి. పైగా ఇంట్లోనే పనిచేసుకోవాలి. కానీ ట్యాబ్‌కు ఆ అవసరం లేదు. అందుకే పిసిలతో పోస్తే ట్యాబ్స్ చాలా సౌకర్యంగా ఉంటాయి. పిసిలో చేసే అన్ని పనులూ ట్యాబ్ ద్వారా చేయవచ్చు.

3జీ సదుపాయంతో ఆల్కాటెల్
ఆల్కాటెల్ వన్‌టచ్ పిక్సీ 3 ట్యాబ్లెట్. దీనిలో 1౦ అంగుళాల టచ్ స్క్రీన్‌ను పొందుపరిచారు. ఇందులో 1.3గిగా హెడ్జ్,32 బిట్ డ్యూయెల్ కోర్ మిడియా టెక్ ఎంటి 8127 ప్రాసెసర్‌ను వినియోగించారు. ఇది ఆండ్రాయిడ్ 5.౦ లాలీపాప్‌తో పనిచేస్తుంది. 1జిబి ర్యామ్‌ను పొందుపరిచారు. 5 మెగా పిక్సెల్ రియర్ కెమెరాను, మెగా పిక్సెల్ ఫ్రంట్‌ఫెసింగ్ కెమెరాను ఏర్పాటు చేశారు. 16 జిబి అంతర్గత మెమరీని పొందుపరిచారు. దీన్ని మైక్రో ఎస్డీ ద్వారా ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. 4౦6౦ ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థం ఉంది. ఇందులో 3జీ, వై-ఫై లాంటి సదుపాయాలు ఉన్నాయి.

పెద్ద స్టోరేజ్ సామర్థంతో స్యామ్‌సంగ్ గెలాక్సీ
స్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్2 ఎల్‌టిఇ మోడల్ ట్యాబ్‌ను 5.6 మందంతో రూపొందించారు. ఇది ఆండ్రాయిడ్ లాలీపాప్‌తో పని చేస్తుంది. 9.7 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేను పొందుపరిచారు. ఆక్టాకోర్ ఎక్సీనోస్ 5433 ప్రాసెసర్‌ను వినియోగించారు. 3జిబి ర్యామ్ ఏర్పాటు చేశారు. 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2.1 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను పొందుపరిచారు. 32 జిబి ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఉంది. దీన్ని మైక్రో ఎస్డీ ద్వారా 128 జిబిల వరకు పెంచుకోవచ్చు. 3జీ, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్, కంపాస్, హాల్ సెన్సార్ లాంటి సదుపాయాలు ఉన్నాయి. 392 గ్రాముల బరువుంది. 587౦ ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థం ఉంది.

వాయిస్ కాలింగ్ ఫీచర్‌తో డెల్ వెన్యూ
డెల్ వెన్యూ-7 3741 బడ్జెట్ వాయిస్ కాలింగ్ ట్యాబ్లెట్. ఇది సింగిల్ సిమ్‌తో, ఆండ్రాయిడ్ కిట్ క్యాట్‌తో పనిచేస్తుంది. 6.95 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్‌ను పొందుపరిచారు. ఇందులో ఇంటెల్ ఆటమ్ 1.3గిగాహెడ్జ్ ప్రాసెసర్‌ను వినియోగించారు. 1జిబి ర్యామ్ సదుపాయం ఉంది. ఇందులో 2మెగా పిక్సెల్ రియర్ కెమెరాను పొందుపరిచారు. 0.3 పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను ఏర్పాటు చేశారు. 8జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. దీన్ని మైక్రో ఎస్డీ ద్వారా, 64జిబిల వరకు పెంచుకోవచ్చు. 3జికి సపోర్టు చేస్తుంది. మైక్రోయూఎస్‌బి, వై-ఫై, బ్లూటూత్ లాంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. బ్యాటరీ సామర్థం 41౦౦ ఎంఎహెచ్. దీని బరువు 315 గ్రాములు. దీని ధర రూ.7,999.

డ్యూయెల్ విండో ఆప్షన్‌తో ఎల్‌జి జి-ప్యాడ్
ఎల్‌జి కంపెనీ జి ప్యాడ్ ట్యాబ్‌లో వై-ఫై అందుబాటులో ఉంటుంది. ఇందులో రీడర్స్ మోడ్‌లో ఇ- బుక్స్‌ను చదువుకోవచ్చు. డ్యూయెల్ విండో మోడ్ ద్వారా స్క్రీన్‌ను రెండుగా డివైడ్ చేసుకోవచ్చు. తద్వారా రెండు యాప్స్‌ను ఒకే సమయంలో చూసుకోవచ్చు. ఇందులో ప్రీలోడెడ్ మైక్రోసాఫ్ట్ యాప్స్ వస్తాయి. 100 జిబి ఫ్రీ వన్‌డ్రైవ్ స్టోరేజ్ రెండు సంవత్సరాల కాలపరిమితికి ఆఫర్ చేస్తుంది. 10.1 అంగుళాల డబ్లూయూఎక్స్‌జిఎ డిస్‌ప్లేను పొందుపరిచారు. పిక్సెల్ డెన్సిటీ 224పిపిఐ. ఇందులో2 జిబి ర్యామ్‌ను పొందుపరిచారు. క్వాడ్‌కోర్ 2.26గిగా హెడ్జ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8౦౦ ప్రాసెసర్‌ను వినియోగించారు. ఆండ్రాయిడ్ 5.1.1లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. ఇందులో 16 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఆఫర్ చేస్తుంది. మైక్రో ఎస్డీ ద్వారా మెమరీని పెంచుకోవచ్చు. 5 మెగా పిక్సెల్ రియర్ కెమెరా,2 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను పొందుపరిచారు. 74౦౦ ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థం ఉంది.

స్పైస్ బడ్జెట్ ట్యాబ్స్
స్పెస్ ఎంఐ-710, ఎంఐ-730 అనే రెండు ట్యాబ్లెట్‌లు ఇ-కామర్స్ మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. స్పైస్ ఎంఐ-710 ధర రూ.3,999, ఎంఐ-730 రూ.4,999 ధరలకు లభిస్తుంది. ఈ రెండు ట్యాబ్లెట్ల్‌లో కొన్ని కామన్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇవి రెండూ ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తాయి. 7 అంగుళాలు ఉన్న (600×1024) హెచ్‌డి డిస్‌ప్లేలు కలిగి ఉన్నాయి. 512 ఎంబి ర్యామ్, 4జిబి అంతర్గత మెమరీని కలిగి ఉన్నాయి. అయితే మైక్రో ఎస్‌డి కార్డ్ ద్వారా 32 జిబి వరకు మెమరీని పెంచుకోవచ్చు. అంతేగాక, వీటి బ్యాటరీ 2800ఎంఎహెచ్ సామర్థం కలిగి ఉంది.
స్పైస్ ఎంఐ-710 ట్యాబ్లెట్‌కు రియర్ కెమెరా 2 మెగాపిక్సెల్, 1.3మెగాపిక్సెల్ ఫ్రంట్‌ఫేసింగ్ కెమెరాని కలిగి ఉంది. ఇందులో 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను వినియోగించారు. డ్యూయెల్ సిమ్ (3జి+3జి) సదుపాయం ఉంది. స్పైస్ ఎంఐ-730 ఫీచర్లలో… 2 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 0.3 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. ఇందులో 1.3 గిగాహెడ్జ్ డ్యూయెల్ కోర్ ఎస్‌ఓసి ప్రాసెసర్‌ను వినియోగించారు. అంతేకాకుండా వాయిస్ కాలింగ్ ఫీచర్ కూడా ఉంది.
ఈ రెండు ట్యాబ్లెట్‌లకు యుఎస్‌బి, ఒటిజి, వై-ఫై 802.11బి/జి/ఎన్, జిపిఎస్, బ్లూటూత్ లాంటి కనెక్టివిటీ ఆప్షన్లు కలిగి ఉన్నాయి. ఎంఐ-730 తెల్లని రంగులో, ఎంఐ-710 బ్లాక్ కలర్‌లో అందుబాటులో లభిస్తున్నాయి.

అతి పలుచని స్యామ్‌సంగ్ ఎస్ 2
స్యామ్‌సంగ్ రెండు కొత్త ట్యాబ్స్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇందులో ఒకటి 8 అంగుళాలు కాగా, మరొకటి 9.7 అంగుళాలు. వీటిని పలుచగా, బరువు తక్కువగా తయారు చేశారు. ఈ రెండు కూడా యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ 2 కంటే తక్కువ మందంతో వీటిని రూపొందించారు. రెండింటిలో అమోలెడ్ డిస్‌ప్లేని వినియోగించారు.
ఎస్ 2 8 ట్యాబ్ దీనిలో 1.3 గిగా హెడ్జ్ ప్రాసెసర్‌ను వినియోగించారు. ఇందులో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 2.1 మెగా పిక్సెల్, రియర్ కెమరాలో 8 మెగా పిక్సెల్‌ను పొందుపరిచారు. ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టంతో పని చేస్తుంది. 32 జిబి ర్యామ్, 32 ఎంబి స్టోరేజ్ సామర్థం ఉంది. 4౦౦౦ ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థం ఉంది. దీని రెజల్యూషన్ 1536 x2048. బరువు 265 గ్రాములు.
ఎస్ 2 9.7 ట్యాబ్ లో దాదాపు ఎస్ 2 8 ట్యాబ్ ఫీచర్లే ఉన్నాయి. స్క్రీన్ సైజు, బ్యాటరీ సామర్థంలోనే తేడాలున్నాయి. ఈ రెండు తప్ప మిగిలిన విషయాల్లో అన్ని ఆప్షన్లు ఒకేలా ఉన్నాయి. 5870 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థం ఉంది. దీని బరువు 389 గ్రాములు.

Comments

comments