Home యాదాద్రి భువనగిరి నేటి విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలు

నేటి విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలు

abdul

*విద్యావైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొన్న మంత్రి జగదీష్‌రెడ్డి

మన తెలంగాణ/యాదాద్రిభువనగిరి : నేటి విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలు అని, మానవ సమాజం మనుగడకు పర్యావరణం కాపాడుకోవడానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలో ప్రప్రథమంగా మండలంలోని అనాజిపురం గ్రామ శివారులోగల దివ్యాబాల విద్యాలయంలో సోమవారం ఘనంగా జరిగిన 45వ జిల్లాస్థాయి విద్యావైజ్ఞానికవేదిక ప్రదర్శన -2017ను ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18,19,20వ శతాబ్దంలో శాస్త్రవేత్తలు ప్రజల సంక్షేమానికి, సౌకర్యానికి విమానం, టెలిఫోన్ మొదలగునవి కనుగొన్నారని తెలిపారు. కాని మన భారత ఇతిహాసాలు, పురాణాలలో వీటికి సంబంధించిన ఆవిష్కరణలు ఎప్పటినుంచో ఉన్నాయని తెలిపారు. ఆ గొప్ప-గొప్ప శాస్త్రవేత్తలు ఒకప్పుడు విద్యార్ధులేనని వారి మనసులకు తట్టిన సందేహాలను, అనుమానాలను నివృత్తి చేసుకొని శాస్త్రవేత్తలుగా మారారని తెలియజేశారు. ఇక్కడ కూర్చున్న విద్యార్థుల్లో సందేహనివృత్తి అనే తపన ఉన్నప్పుడే గొప్ప-గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదుగుతారని పేర్కొన్నారు. నేడు పర్యావరణం సమస్యవలన నీటి, గాలి కాలుష్యంతో అనేక రోగాలు ప్రబలడంతో ఫలితంగా జీవన ప్రమాణాలు తగ్గుతున్నాయన్నారు. భూమి, గాలి, నీటిని కాపాడుకోవడం అందరి కర్తవ్యంగా భావించి కష్టంతో కాకుండా ఇష్టంతో ఇలాంటి సైన్స్‌ఫేర్‌లలో భాగస్వాములైతే రేపటి భవిష్యత్తులో రాబోయేతరాలకు ఉపయోగపడుతాయని తెలిపారు. ఆనంతరం ఎమ్మెల్సీ పూల రవీందర్ మాట్లాడుతూ నేడు ప్రపంచీకరణ జరుగుతున్న సందర్భంగా పిల్లలను పోత్సహించి సృజనాత్మకతను వెలికి తీయడమే ఈ విజ్ఞాన ప్రదర్శన ముఖ్య ఉద్ధేశ్యమన్నారు. కేవలం తరగతి బోధన, పాఠ్యపుస్తక బోధన ద్వారా 50 శాతం జ్ఞానం పెరుగుతోందని మిగతా 50శాతం విద్యార్థులకు ఇలాంటి విజ్ఞాన ప్రదర్శనల ద్వారానే పెరుగుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే పైళ్లశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎమినేటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈలాంటి ప్రదర్శనతో విద్యార్థుల మేథాసంపత్తి పెరుగుతుందన్నారు. దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉన్నందున చదువుతో పాటు, ప్రయోగాత్మక జ్ఞానం పెంపొందించాలన్నారు. మొదటి రోజు నిర్వహించిన 361 ప్రదర్శనలు తిలకించడానికి సుమారు 200 మంది విద్యార్థులు హాజరుకావడం సంతోషదాయకమని తెలిపారు. మునుగోడు ఎమ్మెల్యే కె.ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, జేసీ రవినాయక్, ట్రైనీ కలెక్టర్ ఆలె ప్రియాంక, మున్సిపల్ ఛైర్‌పర్సన్ సుర్విలావణ్య, గ్రంథాలయ సంస్థఛైర్మన్ జడలఅమరేందర్‌లు వివిద అంశాలపై ప్రసంగించారు.పోలీసు అధికారులు డాగ్ స్కాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. అమరజీవిడా॥ అబ్దుల్‌కలాం చిత్రపటానికి పూలమాలవేశారు. డీఈవో రోహిణి అధ్యక్షత నిర్వహించగా వేదిక సమన్వయ కర్త డా॥ పోరెడ్డి రంగయ్య తనదైనశైలిలో సభనిర్వహించిన ఈ కార్యక్రమంలోస్థానిక ఎంపీపీ సభ్యుడు తోటకూరి వెంకటేష్‌యాదవ్, గ్రామ సర్పంచ్ అశోక్, ఎంపీటీసీ సభ్యుడు దాసరి పాండు, జిల్లా సైన్స్ కో-ఆర్డినేటర్ నీరుడు అండాలు, జిల్లా సైన్స్ అధికారి పి.రాజశేఖర్, పలు మండలాలకు చెందిన ఎంఈవోలు, గెజిటెడ్ ప్రధానోపాద్యాయులు, వివిధ ఉపాద్యాయ సంఘాల అధ్యక్షకార్యదర్శులు, ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఎన్‌సీసీ వాలంటిరీలు, వివిధ శాఖల అధికారులు, జిల్లా ట్రస్మాఅధ్యక్షకార్యదర్శులు మెరుగు మధు, కోట చిన్నప్ప, టి.రంగారావు, జలెందర్‌రెడ్డి,విద్యార్థులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నాగారాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దాలి
నాగారం గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిందిద్దాలని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. సోమవారం నాగారంలో ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌తో కలిసి గ్రామంలోని వాడవాడల తిరిగి ప్రజా సమస్యలను తెలుసుకొని వెంటనే సమస్య పరిష్కరానికి కృషి చేస్తానన్నారు. మౌలిక వసతులల్లో భాగంగా సీసీరోడ్లు, డ్రైనేజీ, మురికి కాలువలు లాంటి సమస్యల సత్వర పరిష్కరినికి అధికారులను అదేశించారు. గ్రామ సమస్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నాగారం మండలాన్ని ఓడిఎఫ్ గ్రామం గా తీర్చిదింద్దాలన్నారు. వీధిలైట్లు ఏర్పాట్లు చేయాలన్నారు. అదేవిధంగా సీసీరోడ్ల నిర్మాణానికి రూ.1.09కోట్ల పతిపధనలు, డ్రైనేజీ కోసం రూ.73లక్షలుపతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఎస్సీ కమ్యూనీటీ హల్ నిర్మాణం కోసం రూ.50లక్షల రూపాయాలు మంజూరు అయినట్లు తెలిపారు. ఆయన వెంట ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్, ఆర్డీవో మోహన్‌రావు, డిఇ ప్రభు, ఎంపిడివో బి.శిరీష, తహసీల్దార్ చంద్రశేఖర్, ఏపీవో గుండు వెంకన్న, ఐబీఏ ఏఈ సత్యనారాయణ, వివిధశాఖల అధికారులు పంచాయతీ కార్యదర్శి, వీఆర్‌ఓ, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు గుండగాని అంబయ్య, కడారి యాదవరెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.