Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

కిక్కుకే – కిక్

Told that he could not do the injuries while making a mad

ప్రస్తుతం సోషల్ మీడియాలో కికి ఛాలెంజ్ ఎంతగా వైరల్ అవుతుందో తెలియంది కాదు..ఈ ఛాలెంజ్ ప్రమాదంతో కూడిందని పోలీసులు చెబుతున్నా యువత మాత్రం ఈ ఛాలెంజ్ లో పాల్గొంటూనే ఉంది. తాజాగా యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ – చందమామ కాజల్‌లు కికి ఛాలెంజ్‌ని స్వీకరించారు. కాకపోతే కొత్త యాంగిల్ కికి ఇచ్చారు. పిచ్చి కికి చేస్తూ గాయాలపాలు కావొద్దని.. కికి చేసినా జాగ్రత్తగా చేయమని తెలియజేసారు. తన ట్విట్టర్ ద్వారా ఈ ఛాలెంజ్ వీడియో పోస్ట్ చేస్తూ ఇలా ట్వీట్ పెట్టాడు ‘మేము కూడా ఇందులో అడుగుపెట్టాం. లేట్ అయినా ఫరవాలేదు కానీ సేఫ్ గా! మేము జాగ్రత్తగా చేసింది ఇది.. కికి వీ లవ్ యూ(కానీ రూల్స్ అంటే మాకింకా ప్రేమ). కాజల్ తో కలిసి ఒక యాక్షన్ సీక్వెన్స్ షూట్ లో పాల్గొంటూ ఇలా ట్రై చేశాను. అంటూ పోస్ట్ చేశాడు బెల్లంకొండ.

మొదట శ్రీనివాస్ వీల్ చైర్‌లో కూర్చుని ఉంటే కాజల్ వీల్‌చైర్ హ్యాండ్‌పై కూర్చుంది. ఆ వీల్ చైర్‌ను వేరేవాళ్ళు నెట్టుకుంటూ వస్తారు.. తర్వాత ఇద్దరూ లేచి కికి డూ యు లవ్ మీ అంటూ డ్యాన్స్ చేస్తారు. ఫైనల్ గా కాజల్ వీల్ చైర్లో కూర్చుంటుంది. శ్రీనివాస్ ఆ వీల్‌చైర్‌ను నెట్టుకుంటూ వెళ్తాడు. కానీ అలా కూర్చునే ముందు తమ మొహాలకైన గాయాలకున్న బ్యాండ్-ఎయిడ్‌లను చూపిస్తూ కికిని జాగ్రత్తగా చేయకపోతే ఇలా అవుతుందని కాబట్టి ఇప్పుడు చేసినట్టు సేఫ్‌గా చేయమని చెప్పారు. ప్రస్తుతం వీరిద్దరూ తేజ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నారు.

Comments

comments