Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

‘సైరా’లో కీలక పాత్రలో బన్నీ…

Allu Arjun In Sye Raa Narasimha Reddy

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్‌తో  ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా.. నరసింహారెడ్డి’. బ్రిటిష్ వారితో పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథతో తీస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.  ఇటివలే ప్రధాన పాత్రధారులు పాల్గొనగా కొన్ని పోరాట సన్నివేశాలు చిత్రికరీంచారు. అయితే  ఈ సినిమాలో అల్లు అర్జున్ కూడా ఒక కీలక పాత్రను పోషించనున్నాడనేది తాజా సమాచారం. ‘రుద్రమదేవి’ సినిమాలో గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ అద్భుతమైన పాత్రను పోషించిన విషయం తెలిసిందే. ఆ పాత్ర ఆయనకి ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరహా పాత్రనే ఆయన ఈ సినిమాలోను చేయనున్నట్టు సమాచారం . అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించవలసి వుంది.

 

Comments

comments