Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

వైసిపిలోకి నటుడు కృష్ణుడు

Tollywood actor Krishnudu Joins YSRCP
అమరావతి: నటుడు కృష్ణుడు వైసిపి కండువా కప్పుకున్నారు. వైసిపి అధినేత వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి సమక్షంలో సోమవారం ఆయన పార్టీలో చేరారు. అనంతరం జగన్‌తో కలిసి కృష్ణుడు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఒక సామాన్య కార్యకర్తగా వైసిపి గెలుపుకోసం పోరాడుతానన్నారు. అలాగే జగన్‌‌ను ముఖ్యమంత్రి చేయడానికి కృషి చేస్తానన్నారు. జగన్ పోరాట పటిమ నచ్చడంతోనే పార్టీలో చేరినట్లు తెలిపారు. ఇక ఇంతకుముందు నటుడు పోసాని కృష్ణ మురళి, హాస్యనటుడు పృథ్వీ, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు తదితరులు జగన్‌ ప్రజా సంకల్పయాత్రకు మద్దతు తెలపడంతో పాటు ఆయనతో కలిసి పాదయాత్రలో కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. దీంతో వైసిపికి సినీగ్లామర్ తోడవుతుంది. ఇప్పటికే నటి రోజా పార్టీ ఎంఎల్ఎగా ఉన్నారు.

Comments

comments