మొదట్లో టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌తరుణ్ శరవేగంగా తన సినిమాలను పూర్తిచేసేవాడు. ఈమధ్యన కొంత నెమ్మదించినప్పటికీ ఈ హీరోకు సక్సెస్ రేట్ బాగా ఎక్కువ. అందుకే రాజ్‌తరుణ్‌కు ఇప్పుడు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. అయితే వేసవిలో వచ్చిన ‘ఈడో రకం ఆడో రకం’ సినిమా తర్వాత అతని సినిమా ఏదీ రిలీజ్ కాలేదు. కానీ మధ్యలో ఈ యంగ్ హీరో రెండు కేమియో రోల్స్ చేశాడు. నాని నటించిన మజ్నులో కేమియో పాత్ర చేసిన అతను హెబ్బాపటేల్ మూవీ ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్’లో క్లైమాక్స్‌లో వచ్చే పెళ్లి కొడుకు పాత్రలో అలరించాడు.
అయితే ఈ కేమియోలు ఆయా సినిమాలకు ఉపయోగపడ్డాయే తప్ప రాజ్‌తరుణ్‌కు మాత్రం కొంచెం కూడా గుర్తింపు తెచ్చిపెట్టలేకపోయాయి. దీంతో ఇలాంటి రోల్స్ విషయంలో కఠిన నిర్ణయం తీసుకున్నాడట రాజ్‌తరుణ్. ఫ్రెండ్షిప్ కోసం… మొహమాటం కోసమో అలాంటి కేమియో రోల్స్‌లో నటించకూడదని నిర్ణయించుకున్నాడట. ప్రస్తుతం అతను ఒకేసారి మూడు సినిమాల్లో నటించేస్తున్నాడు. కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త అనే సినిమాలో కుక్కల కిడ్నాపర్‌గా నటిస్తుండగా… అంధగాడు అనే చిత్రంతో పాటు లేడీ డైరెక్టర్ సంజన దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు ఈ కుర్ర హీరో