Home సినిమా బాలీవుడ్‌లోకి ఎంట్రీ

బాలీవుడ్‌లోకి ఎంట్రీ

Megha

నితిన్ సరసన లై, ఛల్ మోహన్‌రంగ చిత్రాల్లో నటించి అలరించిన యంగ్ బ్యూటీ మేఘా ఆకాష్. చక్కటి అందం, మంచి నటనతో ఈ అమ్మడు తెలుగు యువతకు ఎంతగానో నచ్చింది. కానీ ఆమె తెలుగులో సక్సెస్‌ను మాత్రం అందుకోలేకపోయింది. దీంతో ఆమెకు టాలీవుడ్‌లో మరో ఆఫర్ దక్కలేదు. అయితే కోలీవుడ్‌లో ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న ఓ సినిమాలో మేఘా ఆకాష్ కీలక పాత్రకు ఎంపికైంది. ఈ సినిమాలో మంచి పాత్రలో నటించనుంది ఈ ముద్దుగుమ్మ. ఇక బాలీవుడ్‌లో ఓ లక్కీ ఆఫర్‌ను ఆమె దక్కించుకుంది. అక్కడ ఆదిత్య పంచోలి సరసన నటించే అవకాశం వచ్చింది. ఇర్ఫాన్ కమల్ దర్శకత్వంలో ‘శాటిలైట్ శంకర్’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మేఘ హీరోయిన్‌గా చేయనుంది.