Home తాజా వార్తలు వైసిపిలో చేరిన హాస్యనటుడు అలీ

వైసిపిలో చేరిన హాస్యనటుడు అలీ

Comedian Aliహైదరాబాద్: ప్రముఖ హాస్యనటుడు అలీ కాసేపటి క్రితం వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్ లోని లోటస్‌పాండ్‌లో పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం అలీ మీడియాతో మాట్లాడారు. జగన్ ను ముఖ్యమంత్రి చేయాలనేది తన ఆకాంక్ష అని చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి జగన్ అని అలీ పేర్కొన్నారు. ఎప్పటి నుంచో నాకు వైఎస్ఆర్ కుటుంబంతో అనుబంధం ఉందన్నారు. వైఎస్ జగన్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఎన్నికల్లో జగన్ తరఫున ప్రచారం చేస్తానన్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, పార్టీ నిర్ణయాల మేరకు పని చేస్తానని తెలిపారు. అయితే, పార్టీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం అలీకి టికెట్ విషయంపై జ‌గ‌న్ ఎలాంటి హామీ ఇవ్వ‌కపోయినా, ఛాన్స్ ఉంటే చివ‌రి నిమిషంలో అవ‌కాశం క‌ల్పిస్తాన‌ని చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ టిక్కెట్ ఇవ్వలేని ప‌క్షంలో పార్టీ లో భవిష్యత్తులో స‌ముచిత స్థానం ఇవ్వ‌డంతో పాటు ఎమ్మెల్సీ కూడా ఇస్తాన‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

Tollywood Comedian Ali Joins YCP