Search
Sunday 18 November 2018
  • :
  • :

శ్రీవారిని దర్శించుకున్న క్రిష్ దంపతులు

Krish-Coupleతిరుపతి: తిరుమల శ్రీనివాసుడిని సినీ దర్శకుడు క్రిష్ దంపతులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం విఐపి ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ కొత్తగా వివాహం జరిగిన నేపథ్యంలో స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా నిర్మిస్తున్న గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం 40శాతం నిర్మాణం పూర్తయిందన్నారు. అంతేగాక ఇండియన్ హిస్టరీలో గౌతమీపుత్ర శాతకర్ణి గొప్ప చిత్రంగా నిలుస్తుందని చెప్పారు.

Comments

comments