Home సినిమా తారలు దిగివచ్చిన వేళ…

తారలు దిగివచ్చిన వేళ…

ఓటు వేసిన పలువురు సినీ ప్రముఖులు

రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో సినీ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటేయండి అని ప్రజలకు చెప్పడమే కాదు… ఓటు వేసి చూపించారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, శ్రీజ, రామ్‌చరణ్ సతీమణి ఉపాసన, సూపర్‌స్టార్ కృష్ణ, విజయనిర్మల, మహేష్‌బాబు, నమ్రత, సమంత, ఎన్టీఆర్, లక్ష్మిప్రణతి, కల్యాణ్‌రామ్, అక్కినేని నాగార్జున, అమల, అల్లు అర్జున్, అల్లు అరవింద్, నాని, రానా, నితిన్, రామ్, నిఖిల్, రాజమౌళి, ఎం.ఎం.కీరవాణి, కె.రాఘవేంద్రరావు దంపతులు, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, మంచు లక్ష్మి,మంచు మనోజ్, నాగబాబు దంపతులు, వరుణ్‌తేజ్, సాయిధరమ్‌తేజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, శ్రీకాంత్, ఊహ, సునీల్, సీనియర్ నరేష్, చలపతిరావు, ఛార్మి, బ్రహ్మాజీ, తారకరత్న, అలీ, నవదీప్, శివబాలాజీ దంపతులు, శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఓటు వేశారు. సూపర్‌స్టార్ కృష్ణ, విజయనిర్మల, నరేష్‌లు శేరిలింగంపల్లి నియోజకవర్గం నానకరాంగూడలో ఓటు వేశారు. సూపర్‌స్టార్ మహేష్‌బాబు, ఆయన సతీమణి నమ్రత జూబ్లీహిల్స్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఎన్నికల సందర్భంగా మల్టీస్టారర్ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ టీమ్‌కు శుక్రవారం సెలవిచ్చిన దర్శకధీరుడు రాజమౌళి టీమ్ సభ్యులందరినీ ఓటేయమని చెప్పడంతో పాటు ప్రజలందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఇక రాజమౌళి షేక్‌పేట్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన “ఓటు వేసి నా కర్తవ్యాన్ని పూర్తి చేశాను. మరి మీరు..?” అంటూ ట్వీట్ చేశారు. ఓటు వేసిన అనంతరం ఎన్టీఆర్ మాట్లాడుతూ “ఓటు మన బాధ్యత. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి. రాజ్యాంగం, దేశం మనకు కల్పించిన హక్కు ఇది. ఆ హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ఓటేయకపోతే సమస్యలపై ఫిర్యాదు చేసే హక్కును కోల్పోతాం. ఓటు వేయాలని ఒకరితో మనం చెప్పించుకోవడం కాదు… మనసా వాచా కర్మణా ఓటు వేయాలని మనకు అనిపించాలి”అని అన్నారు. ఇక హైదరాబాద్‌లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదు కావడంతో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఆవేదన వ్యక్తంచేశారు. ‘అర్బన్ ఓటర్… షేమ్ ఆన్ యు’ అంటూ కొరటాల ట్వీట్ చేశారు. అయితే స్టార్ హీరో రామ్‌చరణ్ ఈసారి తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఈ విషయం గురించి రామ్‌చరణ్ తన ఫేస్‌బుక్‌లో… “కొన్ని కారణాల వల్ల నేను ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నాను. కానీ దయచేసి అందరూ ఓటు వేయండి” అంటూ పోస్ట్ చేశారు. ఇదిలాఉండగా రామ్‌చరణ్ సతీమణి ఉపాసన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన తర్వాత ఉపాసన మీడియాతో మాట్లాడుతూ “ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకం. ప్రతి ఓటుకు విలువ ఉంటుంది. ఓటే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందరూ తప్పకుండా ఓటు వేయాలి”అని ప్రజలను కోరారు.

Tollywood Film Stars Who Voted in Telangana

Telangana News