Home దునియా ఐ హేట్ దెమ్

ఐ హేట్ దెమ్

పేరు : మాళవికా శర్మ
ముద్దు పేరు: మాల్స్
పుట్టిన తేదీ: 1995, జనవరి 27
పుట్టిన ఊరు: తూర్పు అంధేరీ, ముంబై
మాతృభాష: హిందీ
చదువు: లా
కెరీర్: యాడ్ సినిమాలు: జియాని, హిమాలయ మోడల్, ఎల్‌జి టివి, మెంటోస్, హెయిరాయిల్
తొలి సినిమా: ఏంపిల్లడో ఎల్దమొస్తవా..
తాజా సినిమా: నేలటిక్కెట్
తొలి హీరో: తేజసజ్జ
తాజా సినిమా హీరో: మాస్‌మహారాజా రవితేజా
తాజా సినిమాలో పాత్ర: మెడికల్ స్టూడెంట్‌గా..
తొలి డైరక్టర్: కళ్యాణ్ కృష్ణ (సోగ్గాడే చిన్నినాయన, రారండోయ్ వేడుక చూద్దాం ఫేమ్)
ఫేవరెట్ హీరో: సల్మాన్‌ఖాన్
ఫేవరెట్ హీరోయిన్: అనుష్కాశెట్టి
నచ్చే రంగు: నలుపు
హాబీలు: షాపింగ్, డాన్సింగ్,
ట్రావెలింగ్, మ్యూజిక్ వినడం

Malavika-Sharma

అసలు పేరు మాళవిక శర్మ. ముద్దు పేరు మాళవిక. మాస్‌మహారాజా రవితేజా నటిస్తున్న తాజా సినిమా నేలటికెట్‌తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి తన అందచందాలతో పాటు, ప్రతి భాపాటవాలను ప్రదర్శించేందుకు వస్తోంది ముంబై స్టార్ మాళవికా శర్మ. మెరిపించి మురిపించే అందచందాలతోపాటే చక్కని నటనా సామర్థం గల నటిగా తొలిసినిమాలో మార్కులు కొట్టేసిన మాళవిక సినిమా రంగంలోకి రాకముందు యాడ్స్‌లో మోడల్‌గా నటించి ప్రేక్షకులకు తనను తాను పరిచయం చేసుకుంది. తాజా సినిమాలో మాస్ హీరో పక్కన నటిస్తున్నందున ప్రేక్షకుల మన్ననలు మరింత బాగా పొందగలుగుతాననే హోప్‌తో ఉంది మాళవికకు. ఈ సినిమాకు సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం వంటి సినిమాలు తీసి బాక్స్ ఆఫీస్ వద్ద తన ముద్ర వేసిన కళ్యాణ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండడంతో ఎక్స్‌పెక్టేషన్స్ ఒక రేంజ్‌లో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఎంత కష్టపడ్డా క్లిక్ అవని రవి తేజా ఈ క్లాసీ మాస్ ఫ్యామిలీ యాక్షన్ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఫిదా ఫేమ్ శక్తికాంత్ కార్తిక్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మొదట్లో నేలటిక్కెట్ సినిమాలో మాళవిక పాత్రలో రకుల్ ప్రీత్‌సింగ్‌ను తీసుకోవాలనే ప్రతిపాదన గట్టిగానే నడిచింది. అయితే ఈ పాత్రలో కొత్త ముఖాన్ని పరిచయం చేస్తే బాగుంటుందని ఫిల్మ్‌యూనిట్ లో అంతా అభిప్రాయపడడంతో అవకాశం మాళవికను వరించింది. రిలాక్స్ అవడానికి, ఫ్రెష్‌మూడ్‌తో పనిచేయడానికి కాఫీ తాగుతానంటుంది మాళవిక. గేమ్స్, ఫ్రెండ్స్ రెండూ అందుబాటులో ఉన్నప్పుడు దేన్ని కోరుకుంటావ్ అని అడిగితే ఫ్రెండ్స్‌నే అంటుంది.

ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మాళవికకు సోషల్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది. ఇంట్లో వంటకాలకే మొదటి ఓటువేసే మాళవికకు ఆటాపాటా అంటే ఎంతో మోజు. ఖాళీ సమయాలలో హాపీగా తిరగడం, షాపింగ్ చేయడం అంటే ఎంతో ఇష్టపడుతుంది. షాపింగ్‌ను లవ్ చేసే మీరు ఎవరిని లవ్ చేశారని అడిగితే ‘నో వన్’ అంటుంది. మీకు నచ్చిన రంగు అంటే ఎరుపు, నలుపు, తెలుపు ఇష్టం కానీ బాగా ఇష్టమైన రంగు మాత్రం నలుపే నంటుంది. చీజ్, పాస్తాలంటే ఎగబడే మాళవిక చాక్లెట్లంటే అసహ్యించుకుంటుంది. ‘ఐ హేట్ దెమ్’ అంటుంది. వ్యక్తిగతంగా మీరేమిటి అని అడిగితే ఏమని నిర్వచించుకుంటారు? నటినంటారా? మోడల్‌నంటారా? యాంకర్ నంటారా? అని అడిగితే లా స్టూడెంట్‌నని చెప్పుకోడానికి ఇష్టపడ తానంటుంది. ప్రేమ మీద నమ్మకం ఉందా? ఎవరినైనా ప్రేమించారా? అని అడిగితే ప్రేమను గురించి, ప్రేమికుడి గురించి ఆలోచించేంత వయసులేదు నాకు అని చెబుతుంది. నువ్వు మితభాషివా.. మాటకారివా అని అడిగితే సిగ్గరిని అని చెబుతుంది. మీ తల్లిదండ్రుల తర్వాత అంత గొప్పగా ఎవరిని ప్రేమిస్తారు? అని అడిగితే ‘నన్ను..’అని సమాధానమిస్తుంది. స్నేహితుల మధ్య ఉండాల్సింది ఏమిటి? స్నేహమా.. ప్రేమా.. అని అడిగితే ‘విశ్వాసం’ అని జవాబు చెబుతుంది.