Home దునియా సెకండ్ ఇన్నింగ్స్‌

సెకండ్ ఇన్నింగ్స్‌

Tollywood Heroinesఒకప్పుడు వారంతా ముద్దుగుమ్మలు ఎంతో డిమాండ్ ఉన్న కథానాయికలు. వెండితెరను మకుటం లేని మహారాణుల్లా ఏలారు. తర్వాత హీరోయిన్ పాత్రలకు గుడ్‌బై చెప్పి పెళ్ళిళ్లు చేసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడిప్పుడే ఈ మాజీ ముద్దుగుమ్మలంతా సెకండ్ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో తెలుగులో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన అమల కెరీర్ కూడా బాగానే ఉంది. భూమిక నాని MCA మూవీ తో తెలుగులో గ్రేట్ కంబ్యాక్ ఇచ్చింది. ఇటీవల యూ టర్న్, సవ్యసాచి చిత్రాలతో ఆమె ప్రేక్షకులను మెప్పించింది. ప్రభాస్ నటించిన మిర్చి చిత్రంతో ప్రభాస్‌కి అమ్మగా నటించిన నదియా తెలుగులో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది.

తరువాత వరస ఆఫర్స్ తో అత్తారింటికి దారేది సినిమాలో పవన్‌కళ్యాణ్‌కు అత్తగా నటించి అత్త పేరుతో టైటిల్‌నే పెట్టేంతగా.. చిత్రంలో ఆమె నటన తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత అ ఆ.., నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా చిత్రాల్లో నటించింది. దృశ్యం సినిమాలో మీనా వెంకటేశ్ సరసన నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత కొన్ని టీవీ షోలు కూడా చేసింది. 2017లో బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రంలో మీనా హీరోకు తల్లిపాత్ర కూడా పోషించారు. స్నేహ ‘రాజన్న’ సినిమాలో నాగార్జునతో, ప్రకాశ్‌రాజ్‌తో ‘ఉలవచారు బిర్యానీ’, ‘S/O సత్యమూర్తి’ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌కు గానూ సైమా అవార్డును గెలుచుకుంది. ఇటీవల ‘వినయ విధేయ రామ’ లో చరణ్‌కు వదినగా నటించి ప్రేక్షకులను మురిపించింది.

Tollywood Heroines Second Innings In Telugu