Home దునియా కిక్2తో ఇండస్ట్రీలో గుర్తింపు

కిక్2తో ఇండస్ట్రీలో గుర్తింపు

పిట్టకొంచెం కూత (పాట) ఘనం..అనే సామెత ఈ అమ్మాయికి వర్తిస్తుంది. సాధించాలన్న తపన ఉంటే వయస్సుతో  సంబంధం లేదని నిరూపించింది. మొక్కవోని దీక్షతో నిరంతర పట్టుదలతో సంగీత సాగరంలో తన పాటతో ఓలలాడిస్తూ చిన్న వయస్సులోనే విజయతీరాల వైపు పయనం కొనసాగిస్తోంది. 16 సంవత్సరాలు వచ్చే సరికి 50 పాటలు పాడి తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్రను వేసుకుంది. కిక్ 2 లో తీస్‌మార్‌ఖాన్ బరిలో షేర్‌ఖాన్ అనే పాట పాడినందుకు గాను గామా అవార్డును సైతం అందుకుంది.  నాన్న సినీ దర్శకుడిగా తన ప్రతిభను చాటుతుంటే స్ఫూర్తి గాయనిగా దూసుకెళుతోంది సింగర్ స్ఫూర్తి.  2016 సంవత్సరంలో తెలుగుబుక్ ఆఫ్ రికార్డులో సైతం తన పేరు నమోదయ్యింది. హాలీవుడ్ పాటలను పాడడమే లక్షంగా ముందుకు దూసుకెళుతున్న స్ఫూర్తితో  దునియా మాటా ముచ్చట…

Singer

పదకొండేళ్ల వయస్సులోనే సినిమాల్లో మొదటి పాడి గాయనిగా పరిచ యమయ్యింది. ప్రముఖ సంగీత దర్శకులతో శభాష్ అనిపించుకుంది. ఇంటర్నేషనల్ ఆల్బ మ్స్‌తో పాటు పలు సినిమాల్లో పాడాలన్న తన కోరికను నెరవేర్చుకోవడానికి శాయ శక్తులా ప్రయత్నం చేస్తోంది. తెలుగు, హిందీ, కన్నడ, ఒరియా భాషల్లో పాటలు పాడింది. ప్రముఖ సంగీత దర్శకులతో శభాష్ అనిపించుకుంది. ఇంటర్నేషనల్ ఆల్బమ్స్‌తో పాటు పలు సినిమాల్లో పాడాలన్న కోరికను నెర వేర్చుకోవడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తోంది.

మామయ్య స్ఫూర్తితోనే: నేను పుట్టింది ఆదిలాబాద్ జిల్లా మందమర్రి, రామకృష్ణాపురం. నాన్న పేరు జితేందర్, అమ్మ చైతన్య. నాకు చిన్నప్పటి నుంచి పాటలు పాడడమంటే ఇష్టం. స్కూల్‌కు వెళ్లేటప్పుడు టీవీలో వచ్చే పాటలు బాగా వినేదాన్ని. ఆ తరువాత కూనిరాగాలు తీసేదాన్ని. ఇలా ఎక్కువగా ఇంట్లో ఉన్నప్పుడు మెలొడీ పాటలను పాడుతుండేదాన్ని. ఇలా నాకు తెలియకుండానే సంగీతంపై మక్కువ పెంచుకున్నాను. దీంతోపాటు మా మామయ్య జై శ్రీనివాస్ తేజ దర్శకత్వం వహించిన సినిమాలో (దేశం మనదే…తేజం మనదే..ఎగురుతున్న జెండా మనదే) అనే పాట పాడారు. మామయ్యలా సింగర్ కావాలని ఉండేది. ఇది గమనించిన నాన్న నాకు సంగీతంలో శిక్షణ ఇప్పించారు. ప్రస్తుతం డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాను.

మొదటగా 11 సంవత్సరాల వయస్సులో: మొదటగా నాకు 11 సంవత్సరాల వయస్సు ఉన్న ప్పుడు 2011 సంవత్సరంలో యమహోః యమ అనే సినిమాలో (టాకీస్ టాకీస్ టాకీస్) అనే పాట పాడ డానికి నిర్మాత విజయ్‌కుమార్ తో సంగీత దర్శకుడు బోలే నాకు అవకాశం ఇచ్చారు. ఆ ఆ తరువాత ఒక్కడితో, కిక్–2, లోఫర్,అతడొస్తున్నాడు, శంకరాభరణం, పో కిరోడు, మీకోసం, మరల తెలుపనా ప్రియ, బంతి పూ ల జానకి, ఇజం తదితరసినిమాల్లో పాడాను.

వెస్ట్రన్ మ్యూజిక్‌లో 7వ గ్రేడ్ పూర్తయ్యింది: వెస్ట్రన్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. 7వ గ్రేడ్ సెప్టెంబర్‌లో పూర్తవుతుంది. హాలీవుడ్‌లో మనదేశం జెండా పాతాలని, ఒపేరా సింగర్ టాప్-10లో ఉండాలన్నది కోరిక. హాలీవుడ్ గ్రామీ అవార్డు తీసుకోవాలన్నది నా చిరకాల కోరిక. కిక్2లో పాట పాడినందుకు గాను గామా అవార్డును దుబాయ్‌లో అందుకున్నాను. 2016లో తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో నా పేరు నమోదయ్యింది.10తరగతిలో డిస్టింక్షన్ పాసయ్యా ను. బాలీవుడ్ గాయనీ శ్రేయాఘోషల్, హాలీవుడ్ సింగర్స్ స్విస్ట్, లీలిసైరస్ అంటే నాకు ఇష్టం.

నాన్నే గురువు పాడేటప్పుడు నాన్నకొన్ని సలహాలు, సూచనలు చేస్తారు. ఇప్పుడున్న గాయకులు నాతో ఫ్రెండ్లీగా ఉంటారు. టాలీవుడ్‌లో శేఖర్‌చంద్ర, థమన్, అనూప్‌రూబెన్స్‌లు అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తున్నారు. బెంగాల్‌టైగర్‌లో నేను పాడాల్సిన పాట వేరే వాళ్లకు వెళ్లింది. అప్పుడు కొంచెం ఫీలయ్యాను. అంటే నాలో ఉన్న లోపాలు సరిచేసుకోవడానికి ఇదొక అవకాశం అనుకుంటున్నాను. నేను లోఫర్ సినిమాలో పాడిన పాటంటే నాన్నకు చాలా ఇష్టం. చాలా తెలుగు సినిమాలకు డబ్బింగ్ చెప్పాను. కీరవాణి, రాజమౌళి, దేవిశ్రీప్రసాద్ సినిమాల్లో పాడాలని ఉంది.

ఎల్. వెంకటేశం
మన తెలంగాణ ప్రతినిధి