Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

ఈ నెల 9 న సైకిల్ ఎక్కనున్న మెగాస్టార్?

Tollywood-Megastar-Chiranje

మెగాస్టార్ చిరంజీవి… ఆయనకు సినిమాల్లో ఎదురులేదు… తెలుగు సినిమా తెర పై ఆల్ రౌండర్ గా ప్రశంసలందుకొని కొన్ని సంవత్సారాల పాటు టాలీవుడ్ ను ఓ ఊపు ఊపాడు. అయితే, ఇదంతా తెర మీద మాత్రమే.

రీల్ లైఫ్ లో మాత్రం సక్సెస్ అయిన మెగాస్టార్ చిరంజీవి… రియల్ లైఫ్ లో కూడా తనకు తిరుగు లేదనుకొని ప్రజారాజ్యం పార్టీ స్థాపించాడు. అయితే, 2009 ఎన్నికల్లో పరాజాయాన్ని చవిచూసి, పార్టీని కాంగ్రేస్ లో కలపాల్సివచ్చింది.

అయితే, కొన్నేళ్లు గ్యాప్ తీసుకొని మళ్లీ సినిమాల్లోకి తన ఎంట్రీ ఇవ్వబోతున్న మెగాస్టార్ పై తాజాగా ఓ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ టిడిపి లో జాయిన్ అవుతున్నాడని. అయితే, ఇప్పటి వరకు ఎటువంటి ఆఫీషియల్ కన్ఫర్ మేషన్ లేనప్పటికీ…ఆయన ఈ నెల 9 న సైకిల్ ఎక్కనున్నారని సోషల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు వస్తున్నాయి.

అంతే కాదు, మెగాస్టార్ కొన్ని షరతుల మీద టిడిపిలో జాయిన్ అవ్వనున్నాడట. ఇదివరకు తన పార్టీని కాంగ్రెస్ లో కలపినందుకు ప్రతిఫలంగా అప్పుడు చిరంజీవిని రాజ్యసభకు నామినేట్ చేసి కేంద్ర మంత్రిని చేశారు.

సో, రెండేళ్ల తర్వాత మళ్లీ తనను రాజ్యసభకు నామినేట్ చేసి కేంద్ర మంత్రి పదవి ఇచ్చే ఆలోచన ఉంటేనే టిడిపి లో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని… ఈ విషయాన్ని బాబు ముందుంచునున్నాడని.. ఒకవేళ బాబు ఓకే అంటే వెంటనే టిడిపి కండువా కప్పుకోనున్నాడని టాక్.

Comments

comments