ఈ ఏడాది ఫస్టాఫ్ పర్వాలేదనిపించింది. ‘గోపాల గోపాల’, ‘పటాస్’, ‘జిల్’, ‘దోచెయ్’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా ల హిట్లతో టాలీవుడ్ సక్సెస్ గ్రాఫ్ ఓ మోస్తారు స్పీడ్‌తో వెళ్లింది. ఇప్పుడు సెకం డాఫ్ నడుస్తోంది. జులై రాకతోనే ఇం డియన్ సినిమా హిస్టరీలో కొత్త రికార్డులు చేరా యి. ఈ రికార్డు లకు టాలీవుడ్ కేంద్ర బిందు వుగా నిలవడం విశేషం. రాజ మౌళి దర్శకత్వం లోని ‘బాహుబలి’ తెలుగుతో కలిసి నాలు గు భాషల్లో విడుదలై 500 కోట్ల క్లబ్‌ను దాటడం విశేషం. ఓ వైపు ‘బాహు బలి’ బంపర్ హిట్ కలెక్షన్లతో చెలరేగి పోతుం టే ఈలోగానే ‘శ్రీమంతుడు’ చడీచప్పు డు చేయ కుండా వచ్చేశాడు. డే వన్ హిట్ టాక్ వచ్చింది. ఫస్ట్ డే భారీగా వసూళ్లు ఝులిపిం చేశాడు ‘శ్రీమంతుడు’. దీంతో సెకండాఫ్‌లో టాలీవుడ్ సినిమాలు భారీగా వసూళ్లను సాధించి అదర గొడుతున్నాయి. ఈ సీజన్లో రెండు భారీ సినిమాలు వరుసగా గ్రాండ్ స్టార్ట్నిచ్చాయి.
తెలుగుతో పాటు తమిళ్లోనూ విడుదలైంది ప్రిన్స్ మహేష్‌బాబు సినిమా ‘శ్రీమంతుడు’. ఈ సినిమా మన దేశంలోనే కాదు ఓవర్సీస్లోనూ భారీగా వసూ ళ్లను సాధిస్తోంది. బాహుబలి తర్వాత ‘శ్రీమం తుడు’ కూడా అదే రేంజ్లో కలెక్షన్లను సాధి స్తుండడం ట్రేడ్ వర్గాలను సంతోషపెడుతోంది. ప్రస్తుతం ‘శ్రీమం తుడు’ ఫుల్‌జోష్‌లో ఉన్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా వీకెండ్ వసూళ్లతో దుమ్ముదు లుపుతోంది. తెలుగులో ఈ సినిమా ఓవర్సీస్తో కలుపుకొని 42 కోట్లను కలెక్ట్ చేసింది. ఓవర్సీస్లో సినిమా 10 కోట్లు రాబట్టడం విశేషం. ఇక తమిళ్లో ‘సెల్వందన్’ పేరిట విడుదలైన ఈ సినిమా ఫస్ట్ వీకెం డ్లో 7 కోట్ల కలెక్షన్లను సాధిం చింది. దాదాపు 200 థియే టర్లలో ఈ సినిమా అక్కడ ప్రేక్షకుల ముం దుకు వచ్చింది. ఇదిలా ఉండగా ‘బాహుబలి’ కలె క్షన్ల పరంపర ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద కొనసాగుతూనే ఉంది. 31 రోజు ల్లో ఈ సినిమా 540 కోట్ల ను కలెక్ట్ చేసిం ది.
ఇక రాబోయే రోజు ల్లో కూడా టాలీ వుడ్లో హిట్ సిని మాల పరంపర కొనసాగే అవ కాశాలున్నా యి. భారీ సినిమాలు రుద్రమదేవి 3డి, కిక్ 2లు కూడా విజయ వంతమై మంచి కలెక్షన్లు సాధిం చే ఛాన్స్ ఉంది. గుణశేఖర్ దర్శక నిర్మాతగా అనుష్క టైటిల్ రోల్లో న టించిన చిత్రం ‘రుద్రమదేవి’. భా రతదేశపు తొలి హిస్టా రికల్ స్టీరియోస్కోపిక్ 3డి చిత్రమిది. ఈ సిని మా సెప్టెంబర్ 4న తెలు గు, తమిళ్‌తో పాటు మలయాళంలో నూ ప్రపంచ వ్యా ప్తంగా విడుదల కాబోతోంది. 13వ శతా బ్దానికి చెందిన కాకతీయుల మహారాణి రుద్రమదేవి జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది ఈ సినిమా. అద్భుత దృశ్యకావ్యంగా తెర కెక్కిన ‘రుద్రమదేవి’ కూడా సూపర్‌డూపర్ హిట్‌గా నిలిచి భారీ కలెక్షన్లు సాధించే అవకాశముంది. ఇక రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘కిక్ 2’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసు కొని ఈనెల 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా సైతం హిట్‌గా నిలిచే అవకాశాలున్నాయి. దీంతో టాలీ వుడ్‌కు సెకండాఫ్ బాగా కలిసివచ్చినట్టే.