Home తాజా వార్తలు నిర్మాత కోనేరు అనిల్‌ కుమార్‌ కన్నుమూత

నిర్మాత కోనేరు అనిల్‌ కుమార్‌ కన్నుమూత

Koneru Anil Kumarహైదరాబాద్‌: టాలీవుడ్ నిర్మాత కోనేరు అనిల్‌ కుమార్‌ కన్నుమూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న అనిల్ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని స్టార్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రముఖ దర్శకుడు బాపు దర్శకత్వంలో వచ్చిన ‘రాధా గోపాలం’, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ‘అల్లరి బుల్లోడు’, ఇ.సత్తిబాబు తెరకెక్కించిన ‘ఒట్టేసి చెబుతున్నా’ చిత్రాలను అనిల్‌ కుమార్‌ నిర్మించారు. కోనేరు అనిల్ కుమార్ మృతితో ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు శోకసంధ్రంలో మునిగిపోయారు. కోనేరు అనిల్‌ కుమార్‌ మృతి పట్ల తెలుగు చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Tollywood Porducer Koneru Anil Kumar Passed Away