Home తాజా వార్తలు నటుడు బెనర్జీకి పితృవియోగం

నటుడు బెనర్జీకి పితృవియోగం

Tollywood Senior Actor Raghavaiah Passes Away

హైదరాబాద్: టాలీవుడ్ నటుడు బెనర్జీ తండ్రి రాఘవయ్య(86) గుండెపోటుతో కన్నుముశారు. అనారోగ్యంతో ఆయన తన స్వగృహంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయ‌న‌కు ఓ కొడుకు, కుమార్తె. తెలుగు సినీ ఇండస్ట్రీలో పలువురు సీనియర్ నటులతో పనిచేశారు. `బ్ర‌హ్మ‌చారి` అనే సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆయ‌న‌.. వంద‌లాది చిత్రాల్లో న‌టించారు.  వీరాంజనేయ, కథానాయకుడు, యమగోల వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన నటించిన చివరి చిత్రం కొరటాల శివ తెరకెక్కించిన భరత్ అనే నేను. రాఘవయ్య కొడుకు బెనర్జీ టాలీవుడ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పలు తెలుగు మూవీస్‌లో సహయక పాత్రల్లో నటించి మెప్పించి పాపులర్ అయ్యారు. బెన‌ర్జీ ప్ర‌స్తుతం `మా` అసోసియేష‌న్‌లో కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. రాఘవయ్య మృతికి టాలీవుడ్ సినీ పరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది. అభిమానుల సందర్శనార్థం ఆయన మృతదేహాన్ని స్వగృహంలో ఉంచారు. ఆదివారం మద్యాహ్నం 3 గంటలకి ఫిల్మ్‌నగర్‌లోని మహా ప్రస్థానంలో రాఘవయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు.