Home తాజా వార్తలు ప్రముఖ నిర్మాత కె.రాఘవ ఇకలేరు

ప్రముఖ నిర్మాత కె.రాఘవ ఇకలేరు

Tollywood Senior Producer K Raghava Passed Away

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కె.రాఘవ (105) కన్నుమూశారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రతాప్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై పలు సూపర్ డూపర్ చిత్రాలను నిర్మించిన కె.రాఘవ చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మనదేశం, భీష్మా, పలనాటి యుద్ధం, సుఖదుఖాలు, జగత్ జంత్రీలు, తరింగిణి, జగత్ కిలాడీలు, తాతా-మనవడు, సంసార సాగరం, చదువు-సంస్కారం, తూర్పు-పడమర, అంతులేని వింత కథ, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, ఈ ప్రశ్నకు బదులేదీ వంటి సూపర్ హిట్ చిత్రాలను రాఘవ నిర్మించారు. ఆయన నిర్మించిన 27 సినిమాల్లో 25 సినిమాలు ఘన విజయం సాధించడం విశేషం. ఎల్ వి ప్రసాద్, దాసరినారాయణ రావు వంటి ప్రముఖ దర్శకులతో పాటు ఎంతో మంది కొత్త నటీ నటులను సినీపరిశ్రమకు మొదట పరిచయం చేసింది రాఘవనే. 1913, డిసెంబర్ 9న ఎపిలోని తూర్పు గోదావరి జిల్లా కోటిపల్లిలో రాఘవ జన్మించారు. రాఘవ మృతితో తెలుగు చిత్రపరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు రాఘవ పార్థవదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.