Home తాజా వార్తలు రైతు రుణాల ఏకకాల మాఫీ డిమాండ్‌పై నేడు రాష్ట్ర బంద్

రైతు రుణాల ఏకకాల మాఫీ డిమాండ్‌పై నేడు రాష్ట్ర బంద్

State-Bandhమన తెలంగాణ / హైదరాబాద్ : రైతు రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని, రైతుల ఆత్మహత్యలను నివారించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు శనివారం రాష్ట్ర బంద్ నిర్వహించనున్నాయి. రైతు సమస్యలతో పాటు, వరంగల్ ఎన్ కౌంటర్‌పై న్యాయవిచారణకోరుతూ వామ పక్షాలు, 370 ప్రజా సంఘాలతో కూడిన తెలంగాణ ప్రజాస్వామిక వేదిక (టిడిఎఫ్) కూడా నిర్వహించనున్నాయి. బంద్‌కు రైతుసంఘాల జెఎసి మద్దతును ప్రకటిం చింది. శాసనసభ లో ఏకమొత్తంగా రైతు రుణమాఫీ చేయాలని పట్టుబట్టిన కాంగ్రె స్, టిడిపి, బిజెపి, వైసిపి, సిపిఐ, సిపిఐ (ఎం) ఎంఎల్‌ఏలందరినీ సమావేశాలు పూర్తయ్యేంత వరకు ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీంతో ప్రతిపక్ష పార్టీలన్నీ 10వ తేదీన బంద్‌కు పిలుపు నిచ్చాయి. తరువా త కాంగ్రెస్, టిడిపి, బిజెపిలు కలిసి బంద్ నిర్వహించాలని నిర్ణ యించాయి. అయితే టిడిఎఫ్ మాత్రం విడిగా బంద్ జరపాలని నిర్ణయించింది. వరంగల్ ఎన్‌కౌంటర్ విషయంలో ఇతర పార్టీలకు కూడా తమ వైఖరితో సమ్మతమైతే కలిసి బంద్ చేసేందు కు అభ్యంతరం లేదని ప్రకటించింది. అన్ని వర్గా ల ప్రజలు, విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్‌కు సహకరించాలని ఇప్పటికే పార్టీలు విజ్ఞప్తి చేశాయి.
ఎవరెవరు ఎక్కడెక్కడ…
వివిధ పార్టీల ప్రధాన నాయకులు హైదరాబాద్‌లో పలు చోట్ల బంద్‌లో పాల్గొననున్నారు. తెల్లవారుజామున ఐదు గంటలకే వివిధ బస్‌స్టేషన్‌లలో జిల్లాలకు పోయే బస్సులను అడ్డుకోవాలని వ్యూహరచన చేశారు. అందులో భాగంగా ఎంజిబిఎస్‌లో టిపి సిసి అధ్యక్షులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూబ్లీ బస్‌స్టేషన్‌లో కాం గ్రెస్ శాసనసభా పక్ష నాయకులు కె.జానారెడ్డి, రాణిగంజ్ బస్ డిపో వద్ద పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క , మెహిదీపట్నం డిపో వద్ద శాసనమండలిలో ప్రతిపక్ష నేత మహ్మ ద్ షబ్బీర్ అలీ బంద్‌లో పాల్గొననున్నారు. టిడిపి, బిజెపి నాయ కులు సికింద్రాబాద్ జూబ్లీబస్ స్టేషన్ వద్ద బంద్ క్యాక్రమంలో పాల్గొంటారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఖమ్మం జిల్లా భద్రాచలంలో జరిగే బంద్ కార్యక్రమాల్లో పాల్గొనను న్నారు. ఉదయం ఎంజిబిఎస్ వద్ద సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, శాసనసభాపక్ష నేత ఆర్.రవీంద్రకుమార్ హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ వద్ద జరిగే బంద్‌లో పాల్గొంటారు. టిడిఎఫ్‌లో భాగస్వామ్య వామపక్ష పార్టీ నాయ కులు ఆర్‌టిసి క్రాస్‌రోడ్స్‌లో ఉదయం 10 గంటలకు వామ పక్షాలు ప్రదర్శన నిర్వహించనున్నాయి. ఇందులో సిపిఐ జాతీ య కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్‌పాషా, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభ్రధం, వేములపల్లి వెంకట్రామయ్య, గోవర్థన్(సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ తదితరులు పాల్గొనను న్నారు. సమస్యలపై చేపట్టిన శనివారం నిర్వహించనున్న బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు చేసిన విపక్షా ల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పలు జిల్లాల్లో వివిధ పార్టీల ముఖ్య నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకు న్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో బైక్‌ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ నగర అధ్యక్షులు దానం నాగేందర్‌తో పాటు పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.