Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

రేపు భారత్ బంద్

barath-bandh

న్యూఢీల్లీ: విద్యా, ఉద్యోగాల్లో కులం ప్రాతిపదికన అమలవుతున్న రిజర్వేషన్లను రద్దు చేయాలనే డిమాండ్‌తో కొందరు మంగళవారం ‘భారత్ బంద్‌కు’ పిలుపునిచ్చారు. దీంతో కేంద్ర  ప్రభుత్వం అన్ని రాష్రాలను అప్రమత్తం చేసింది. అయితే రేపటి బంద్‌కు ఏ ఒక్క సంస్థగానీ, రాజకీయ పార్టీగానీ బాధ్యత వహించడంలేదు. కేవలం సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారం ఆధారంగానే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ మేరకు రంగంలోకి దిగింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలో మార్పులను వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 2న దళిత సంఘాలు చేపట్టిన భారత్ బంద్ హింసాత్మకంగా మారిన నేపథ్యంలో కేంద్రం సూచన ప్రాధాన్యం సంతరించుకుంటుంది. రిజ్వరేషన్లను వ్యతిరేకిస్తూ ఈ నెల 10న ‘భారత్ బంద్’ జరగబోతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వైరల్ అయ్యాయి.

Comments

comments