Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

రేపు కర్ణాటక సిఎంగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం!

yadyurappa

బెంగళూరు: కర్ణాటకలో ఏ పార్టీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందోనన్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెర పడింది. బిజెపి శాసన సభా పక్షనేతగా ఎన్నికైన యడ్యూరప్పను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా కర్ణాటక గవర్నర్ వాజూభాయ్ వాలా ఆహ్వానించారు. బుధవారం అధికారికంగా రాజ్‌భవన్ వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. గురువారం ఉదయం 9.30 గంటలకు కొత్త సిఎంగా యడ్యూరప్ప రాజ్‌భవన్ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.కాగా ఈ నెల 29లోగా యడ్యూరప్ప బలనిరూపణ చేసుకోవాల్సిందిగా గవర్నర్ సూచించినట్లు సమాచారం.

Comments

comments